త్వ‌ర‌లోనే ప్ర‌భాస్-సుజీత్ ల మూవీ టీజ‌ర్, టైటిల్ ప్ర‌క‌ట‌న‌


బాహుబ‌లిః ది కంక్లూజ‌న్ సినిమా ఏప్రిల్ 28న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో చురుకుగా పాల్గొంటున్న ప్ర‌భాస్, మ‌రో వైపు సుజీత్ డైర‌క్ష‌న్ లో ఆయ‌న చేస్తున్నత‌దుప‌రి చిత్ర షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప‌నులు ఎంతో వేగంగా జ‌రుగుతున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా టీజ‌ర్ కోసం ప్ర‌భాస్ మీద ఓ యాక్ష‌న్ సీక్వెన్స్ ను షూట్ చేశాడు సుజీత్. ఈ నేప‌థ్యంలోనే ఈ టీజర్ ఎలా ఉండ‌నుంది, సినిమాలో ప్ర‌భాస్ ఎలా క‌నిపించ‌బోతున్నాడు, అస‌లు టీజ‌ర్ ను ఎప్పుడు రిలీజ్ చేయ‌బోతున్నారు అన్న ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు ప్రేక్ష‌కులు. 

ఈ విష‌యంపై స్పందించిన ప్ర‌భాస్ ఇంకో రెండు, మూడు రోజుల్లో సుజీత్ తో త‌ను చేయ‌బోయే సినిమా టీజ‌ర్ రిలీజ్ డేట్, టైటిల్ వివ‌రాల‌పై ఓ స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్నాడ‌ని చెప్పాడు.  దాదాపు రూ.150 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీమంతుడు, ఘాజీ సినిమాల‌కు ప‌నిచేసిన మాథీ సినిమాటోగ్ర‌ఫీ అందించ‌నుండ‌గా, శంక‌ర్, ఇహ‌షాన్, లోయ్ లు సంగీతం అందించ‌నున్నారు.