తన పెళ్లి గురించి చెప్పేసిన ప్రభాస్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్ల నుంచి చర్చ జరుగుతోంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు.. ఎప్పుడు మీడియాను కలిసినా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురవుతుంది. ఆయన ఇదిగో అదిగో అంటుంటారు. ‘బాహుబలి’ పూర్తవగానే కచ్చితంగా ప్రభాస్ పెళ్లి ఉంటుందని ఆయనన్నారు.  ‘బాహుబలి-2’ కూడా పూర్తి చేసి కొన్ని నెలలవుతున్నా.. ప్రభాస్ పెళ్లి మాటెత్తకుండా సైలెంటుగా సుజీత్ సినిమా మీదికి వెళ్లిపోవడం అందిరకీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికే 37 ఏళ్లు వచ్చేయడంతో అతను ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఉత్కంఠ అభిమానుల్లో పెరిగిపోతోంది.

తాజాగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్‌కు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైతే అతడిచ్చిన సమాధానం అందరికి మరింత ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతానికి పెళ్లి గురించి ఆలోచన లేదని.. వెంటనే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే ప్లాన్స్ తనకి ఏమీ లేవని స్పష్టం చేశాడు ప్రభాస్. తన పెళ్లి వ్యవహారం పెదనాన్న కృష్ణం రాజు చూసుకుంటారని.. ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు జరిగిపోతుందని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.