రాజ‌మౌళికి ఎక్క‌డ క‌ట్ చేయాలో తెలియ‌లేద‌ట‌


బాహుబ‌లి సినిమా స‌రిగ్గా చెప్తే, ఒక‌టే పార్ట్ లో సినిమా మొత్తం తీసెయొచ్చు కానీ సినిమా నిడివి ఎక్కువ‌గా ఉందంటూ, రాజ‌మౌళి దాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశాడు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయ‌డం, అది పెద్ద విజ‌యం సాధించ‌డం, ఇప్పుడు రెండో భాగం కూడా రిలీజ్ కు ద‌గ్గ‌ర ప‌డుతున్న విష‌యం తెలిసిందే. బాహుబ‌లి-2 కోసం ప్రేక్ష‌కులు ఇంత‌గా ఎదురుచూస్తున్నారు అంటే దానికి కార‌ణం, బాహుబ‌లి 2 ని త‌ప్ప‌కుండా చూడాలన్న కోరిక క‌ల‌గడానికి రీజన్ క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అన్న ప్ర‌శ్నే. కేవ‌లం దీనికోసమే యావ‌త్ భార‌తదేశం ఎదురుచూస్తుంది. ఇక్క‌డే రాజ‌మౌళి ప్ర‌తిభ క‌న‌బ‌డుతుంది. 

అయితే బాహుబ‌లి ది బిగినింగ్ ను ఎక్క‌డ వ‌ర‌కు క‌ట్ చేయాలి, బాహుబ‌లిఃది కంక్లూజ‌న్ ను ఎక్క‌డ నుంచి మొద‌లు పెట్టాలి అన్నదాని కోసం రాజ‌మౌళి దాదాపు ప‌దిహేను, ఇర‌వై రోజులు ఆలోచించాడ‌ట‌. చివ‌రకు క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని వెనుక నుంచి పొడిచే సీన్ తో సినిమాకు శుభం కార్డు ప‌డేలా నిర్ణ‌యం అయితే తీసుకున్నాడ‌ట కానీ, ఆ డెసిష‌న్ ఇంత క‌రెక్ట్ గా సెట్ అవుతుందని కానీ, ఈ ప్ర‌శ్న ఇంత హైలైట్ అవుతుంద‌ని కానీ అనుకోలేద‌ట‌. ఈ విష‌యంలోనే ప్ర‌భాస్ మాట్లాడుతూ, రాజ‌మౌళికి ఒక విజ‌న్ ఉంద‌నీ ,ఆ విజ‌న్ నే త‌మ యూనిట్ అంతా న‌మ్మి ముందుకెళ్ళామ‌ని , ఆ న‌మ్మ‌క‌మే బాహుబ‌లిని ఇవాళ ఈ స్థాయిలో నిల‌బెట్టింద‌ని అన్నాడు ప్ర‌భాస్.