ఆయ‌న దృష్టిలో ప్ర‌భాస్ ఎప్పుడూ రాజేన‌ట‌


నాలుగేళ్లు ఏ ఇత‌ర సినిమా చేయ‌కుండా ఎంతో శ్ర‌మ‌ప‌డిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో మీడియాకు ఇంట‌ర్వూలిచ్చిన ప్ర‌భాస్ ఒక ఆస‌క్తిక‌ర సంగ‌తి చెప్పాడు. ఈ నాలుగేళ్లలో రాజ‌మౌళి మీకు ఇంకో క‌థేమీ చెప్ప‌లేదా అని.. ఇప్పుడు చెప్ప‌లేదు కానీ, నాలుగేళ్లు ముందు అంటే రెబ‌ల్ సినిమా డ‌బ్బింగ్ టైమ్ లో రాజ‌మౌళి గారు న‌న్ను క‌లిసిన‌ప్పుడు ఒక స్టోరీ లైన్ చెప్పాడు. అదే బాహుబ‌లి. క‌థ విన్న‌ప్పుడే ఈ సినిమా వ‌ర్కవుట్ అవ్వాలే కానీ, ఈ సినిమా వేరే రేంజ్ కి వెళ్తుంది అని ఆ రోజే అనుకున్నా. అదే నిజ‌మైంది అన్నాడు ప్ర‌భాస్.

బాహుబ‌లి స్టోరీ కంటే ముందే నాలుగైదు క‌థ‌లు రాజ‌మౌళి ప్ర‌భాస్ కు వినిపించాడ‌ని, అయితే అన్ని క‌థల్లోనూ త‌ను రాజు అన్న‌ది మాత్రం కామ‌న్ ఉంద‌ని, రాజ‌మౌళి త‌న‌ను రాజుగా ఫిక్స్ అయిపోయాడ‌ని చెప్పాడు ప్ర‌భాస్. బాహుబ‌లి ఈ నెల 28న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లితోనే త‌న రేంజ్ పెంచుకున్న ప్ర‌భాస్ బాహుబ‌లిః ది కంక్లూజ‌న్ తో త‌న స్థాయి మ‌రింత పెర‌గ‌నుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.