బాహుబ‌లి క‌ష్టాన్ని వివ‌రించిన ప్ర‌భాస్


బాహుబ‌లి కోసం ప్ర‌భాస్ త‌న జీవితాన్నే త్యాగం చేసి మ‌రీ క‌ష్ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. బాహుబ‌లి లో ప్ర‌భాస్ తో పాటూ ప‌నిచేసిన న‌టీన‌టులంతా బాహుబ‌లి కాక మ‌రో రెండు మూడు సినిమాలు చేసేశారు కూడా. కానీ ప్ర‌భాస్ మాత్రం ఈ సినిమా కోసం చాలానే క‌ష్ట‌ప‌డ్డాడు. త‌న పెళ్లిని కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాడు. నాలుగేళ్లు ఈ సినిమా కోసం క‌ష్ట‌ప‌డినందుకు శ్ర‌మ అనిపించలేదా అని ప్ర‌భాస్ ను అడుగ‌గా, దానికి ఓ ఆస‌క్తిక‌ర క‌బురు చెప్పాడు ప్ర‌భాస్.

ఇలాంటి సినిమాలు చేస్తున్న‌ప్పుడు ఖ‌చ్చితంగా క‌ష్ట‌ప‌డాలి, క‌ష్ట‌మ‌నిపిస్తుంది. కానీ ఈ సినిమా ను యూనిట్ లో పని చేసే ఎవ్వ‌రూ క‌ష్టంగా ఫీల‌వ్వ‌లేదు. ఎంతో బాధ్య‌త‌గా, శ్ర‌ద్ధ‌గా ప‌నిచేశాం. ఇలాంటి క‌థ‌లు మ‌నం అనుకున్న‌ప్పుడ‌ల్లా రావు. రాజ‌మౌళి విజ‌న్ మీద బాహుబ‌లి టీమ్ మొత్తానికి న‌మ్మ‌కం ఉండ‌టంతో, ఎవ్వ‌రికీ పెద్ద‌గా ఆ ఫీలింగ్ క‌లుగ‌లేదు అన్నాడు బాహుబ‌లి.