ల‌క్ష కోట్లు ఇచ్చినా ఇప్ప‌ట్లో బాహుబ‌లి లాంటి సినిమా చేయ‌ను


 ‘బాహుబలి’ కోసం చూపించిన కమిట్మెంట్ ఇంకే సినిమాకూ తాను చూపించే అవకాశం లేదని కూడా ప్రభాస్ అన్నాడు. ‘‘స్కూలుకెళ్లే పిల్లాడి లాగా ‘బాహుబలి’ షూటింగుకి వెళ్లాను. షూటింగ్ సందర్భంగా రీటేక్ అడగడానికి కూడా భయమేసేది. ఎందుకంటే వార్ సీక్వెన్స్ తీసేటపుడు ఒక రీటేక్ అంటే.. మళ్లీ ఆ సెటప్ అంతా చేయడానికి 3-4 గంటలు పట్టేది. ఒక షాట్ తీయడానికి 30-40 లక్షలు ఖర్చవుతున్నట్లు చెప్పేవాళ్లు. దీంతో చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. ఈ సినిమాకు ముందు చేసిన ‘మిర్చి’కి నిర్మాతలు నా స్నేహితులే. అప్పుడు నా ఇష్టం వచ్చిన సమయానికి వచ్చేవాడిని. ఏ ఇబ్బందీ ఉండేది కాదు. కానీ ‘బాహుబలి’ విషయంలో మాత్రం అలా కాదు’’ అని ప్రభాస్ అన్నాడు.

ఈ సినిమా కోసం అస‌లు సెట్ కు వెళ్తుంటే, చిన్న‌ప్పుడు స్కూల్ రోజులు గుర్తొచ్చాయి. ప్ర‌తీ రోజూ స్కూల్ కి వెళ్లిన‌ట్లు బాహుబ‌లి షూటింగ్ కు వెళ్లేవాడిని. షూటింగ్ లో రీటేక్ అడ‌గడానికి కూడా భ‌య‌మ‌నిపించేది. ఒక్క రీటేక్ అంటే మ‌ళ్లీ మొత్తం సెట్ చేయ‌డానికి మూడు-నాలుగు గంట‌ల స‌మ‌యం వృధా అవుతుంది. అంటే ఒక్క షాట్ తీయ‌డానికి దాదాపు 30 నుంచి 40 ల‌క్ష‌లు ఖ‌ర్చ‌వుతుంది. ఇంత‌కు ముందు నేను చేసిన మిర్చి నిర్మాత‌లు నా ఫ్రెండ్స్ కావ‌డంతో, నా ఇష్టం వ‌చ్చిన‌ప్పుడు షూటింగ్ కు వెళ్లేవాడిని. కానీ బాహుబ‌లి విష‌యంలో అస‌లు అలా వెళ్దామ‌న్న ఆలోచ‌న కూడా రాలేద‌న్నాడు ప్ర‌భాస్.