ప్రతీ భారతీయుడు చూడాల్సిన సినిమా ఎస్ 3 - పోలీసు ప్రముఖుల ప్రశంసలు


పోలీసు నేపధ్యంలో తెరకెక్కి వరుసగా సంచలనాలు సృష్టిస్తున్న యముడు. సీక్వెల్స్ లో భాగంలో ఇటీవలే వచ్చిన ఎస్ 3 యముడు 3 చిత్రానికి సైతం ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుంచే కాకుండా పోలీసు ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇటీవలే పోలీసు శాఖకు చెందిన పలువురు హై క్యాడర్ ప్రముఖులు చిత్రాన్ని వీక్షించారు. పోలీస్ నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో యముడు 3 చిత్రాన్ని ప్రశంసలతో పొగిడారు. ముఖ్యంగా చిత్ర హీరో సూర్య నటన, దర్శకుడు హరి టేకింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన  సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత  నిర్మాత మల్కాపురం శివకుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు. విడుద‌ల కి ముందే 100 కొట్ల క్ల‌బ్ లో సూర్య న‌టించిన "S3-య‌ముడు-3" చేరిన సంగతి తెలిసిందే. విడుదలైన తర్వాత సైతం అదే ఊపుతో అన్ని చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. 


  ఈ సందర్భంగా నిర్మాత‌ మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌ల‌తో వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న సూర్య‌, హరి కాంబినేషన్‌లో మా సంస్థ ద్వారా తెలుగులో విడుదల చేసిన "S3-య‌ముడు-3". చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. పోలీస్ నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా కావడంతో... కొంతమంది పోలీస్ ప్రముఖులు ఈ సినిమాను వీక్షించారు. వారికి ఈ సినిమా నచ్చడమే కాకుండా... ప్రతీ పోలీసు, ప్రతీ భారతీయుడు ఈ సినిమా చూడాల్సిన సినిమాగా ప్రశంసించారు. సూర్య గారు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ గా యాక్ష‌న్ తో మ‌రొక్క‌సారి విజృంభించారని పొగిడారు. సివిల్ ఐజి సి వి ఆనంద్, అడిషనల్ డిజి అంజన్ కుమార్, అడిషనల్ కమిషనర్ జితేందర్, హైదరాబాద్ సిపి సందీప్ షాండిల్య, సందీప్ రవీంద్ర  జాయింట్ సిపి, శశిధర్ రెడ్డి జాయింట్ సిపి, రిటైర్డ్ డిజిపి అప్పారావ్, డిఐజి హైదరాబాద్ అంకుర్ సబర్వాల్, అమిత్ గార్డ్ ఐజి ఏపి....వీరితో పాటు పలువురు ఐపిఎస్ లు, అధికారులు ఈ చిత్రాన్ని వీక్షించిన వారిలో ఉన్నారు. అని అన్నారు.