ఆ కొత్త హీరో ద‌శ మారిపోతుందా..?


అష్టా చమ్మా, ఉయ్యాలా జంపాలా నిర్మాత రామ్మోహన్‌ పి. కొత్త చిత్రం 'పిట్టగోడ' pgd అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు రామ్మోహన్‌ పి. అష్టాచమ్మాతో హీరోగా పరిచయమైన నాని, ఉయ్యాలా జంపాలాతో హీరోగా పరిచయమైన రాజ్‌ తరుణ్‌ సూపర్‌హిట్‌ సినిమాలు చేస్తూ హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఉయ్యాలా జంపాలా చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన విరించి మజ్నుతో మరో సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించారు. అష్టాచమ్మాతో పరిచయమైన అవసరాల శ్రీనివాస్‌ ఆ తర్వాత హీరోగా సక్సెస్‌ అవ్వడమే కాకుండా దర్శకుడుగా కూడా హిట్‌ సినిమాలను అందించారు. నాని, రాజ్‌తరుణ్‌లను హీరోలుగా పరిచయం చేసిన రామ్మోహన్‌ పి... డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమాస్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై విశ్వదేవ్‌ రాచకొండను హీరోగా, అనుదీప్‌ కె.వి.ని దర్శకుడుగా పరిచయం చేస్తూ దినేష్‌కుమార్‌తో కలిసి 'పిట్టగోడ' పేరుతో ఓ విభిన్నమైన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్‌, ఫ్రెండ్‌షిప్‌ ప్రధానాంశంగా గోదావరి ఖని బ్యాక్‌డ్రాప్‌లో పూర్తి వినోదాత్మక చిత్రంగా 'పిట్టగోడ' చిత్రం రూపొందుతోంది. నవంబర్‌ 25న నేచురల్‌ స్టార్‌ నాని చేతుల మీదుగా 'పిట్టగోడ' ఫస్ట్‌లుక్‌ విశ్వదేవ్‌ రాచకొండ హీరోగా, పునర్నవి భూపాలం హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఉయ్యాలా జంపాలా రాజు, జబర్దస్త్‌ రాజు, శివ ఆర్‌.ఎస్‌., శ్రీకాంత్‌ ఆర్‌.ఎన్‌. ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను నవంబర్‌ 25 సాయంత్రం 6 గంటలకు నేచురల్‌ స్టార్‌ నాని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: 'ప్రాణం' కమలాకర్‌, నిర్మాతలు: దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి., దర్శకత్వం: అనుదీప్‌ కె.వి. https://www.youtube.com/watch?v=gvHzO0UwB44&t=7s