Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

21న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న `పిశాచి-2`


స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "పిశాచి-2ష‌. `డేంజర్ జోన్` అన్నది ట్యాగ్ లైన్.  నల్లగట్ల శ్రీనివాస్ రెడ్డి-తిరుక్కోవళ్ళూరి మురళీకృష్ణ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి.. లయన్ ఏ.వేణుమాధవ్, కొలను సురేంద్రరెడ్డి, అట్లూరి రామకృష్ణ సహ నిర్మాతలు. ఏప్రిల్ 21న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా  బుధ‌వారం  ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో  సాయి వెంక‌ట్ మాట్లాడుతూ, ` క‌న్న‌డ భాష‌లో పెద్ద విజ‌యం సాధించిన చిత్ర‌మిది. ఏ సినిమాలో నైనా విష‌యం ఉంటే హిట్ అవుతుంది. ఈసినిమా కూడా ఆ కోవ‌కు చెందించే. పిశాచి వ‌ల్ల ఓ గ్రామ ప్ర‌జ‌లు ఎదుర్కున్న ఇబ్బందులేంటి?  వాటి నుంచి ఆ దుర్గామాత ఎలా బ‌య‌ట పడేసింది అన్న‌దే క‌థ‌. ప్ర‌తీ స‌న్నివేశం ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. 100 థియేట‌ర్ల‌లలో సినిమా విడుద‌ల చేస్తాం. తెలుగు ప్రేక్ష‌కులంతా సినిమా ను ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.

నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, ` బాహుబ‌లి-2 సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందే పిశాచి ప్రేక్ష‌కుల ముందుకు ఓ పెద్ద సినిమాలా వ‌స్తుంది. ప్రేక్ష‌కులంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.                                                                                                                                                                                                         చిత్ర హీరోయిన్ శిప్రా  గౌర్ మాట్లాడుతూ... తెలుగులో టెన్తులో మూవీ చేశాను. తర్వాత హిందీలో ఒకటి, తమిళంలో రెండు, కన్నడలో రెండు సినిమాలు చేశాను. తెలుగులో పిశాచి 2 గా రిలీస్ అవుతున్న చిత్రం కన్నడలో 150 రోజులు ఆడి నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.తెలుగులో కూడా విజయవంతమౌతుందని టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నా అన్నారు.

ఈ స‌మావేశంలో  సుప్రీక‌ర్, నాగేశ్వ‌ర‌రావు, ముర‌ళీకృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు