Latest News

మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా డీజే.. 100 కోట్లు సాధించ‌డం ఆనందంగా ఉంది - దిల్‌రాజు విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన 'ఏజంట్‌ భైరవ' జూలై 7న విడుదల ఈరోజు నిన్నుకోరి సినిమా జ్యూక్ బాక్స్ విడుదల. జై లవ కుశ టీజర్ మరియు సినిమా విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్. గ్లామర్ తో తెలుగు సినీ పరిశ్రమకి గాలం వేసిన పూజ హెగ్డే టీఎస్‌ఎఫ్‌టీవీ అండ్‌ టీడీసీ చైర్మన్‌గా నియమితులైన పుస్కూర్‌ రామ్మోహన్‌కి దాసరి కిరణ్‌కుమార్‌ అభినందనలు "మెంటల్ మదిలో" చిత్రంలోని అరవింద్ కృష్ణ పాత్ర పరిచయం విజయ్ అదిరింది ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్… జూలై 14న 'దండుపాళ్యం-2' ​ కన్ఫ్యూజన్ చేస్తున్న మెంటల్ మదిలో సినిమా టీజర్

దైవ సన్నిధలో ప్రారంభమైన


శ్రీ రామాంజనేయ ఇంటర్నేషనల్ మూవీ కార్పరేషన్ పతాకం పై అని శైని ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పెళ్లి కథ’. నూతన నటీనటులు మనోహర్, తేజారెడ్డి జంటగా జి.యన్.మూర్తి (గునిశెట్టి)దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి వడ్డి రామాంజనేయులు, కారెం వినయ్ ప్రకాష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని దైవ సన్నిదలో లాంఛనంగా పెళ్లికథ ప్రారంభమైంది. ఫిబ్రవరి 10 నుంచి భీమవరం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని నిర్మాతలు తెలిపారు. పెళ్లి నేపథ్యంలో ఇంతవరకు ఎవకు టచ్ చేయని పాయింట్ తో ఈ సినిమా రూపొందనుందని, ప్రేమతో పాటు కుటుంబ విలువలకు ప్రాధాన్యమిస్తూ, ఇప్పటి ట్రెండ్ కి, యూత్ కి కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన ప్రీ క్లైమాక్స్, పతాక సన్నివేశాలు ఉండబోతున్నాయని దర్శకుడు తెలిపారు. ప్రేమ, కుటంబ కథా చిత్రంగా రానున్న ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు కథ, స్ర్కీన్ ప్లేను జి.యన్.మూర్తి(గునిశెట్టి) అందించారు. అలానే ఈ పెళ్లి కథకు సంగీతం- యమ్.యమ్.కుమార్, డి.ఓ.పి- కళ్యాణ్ శ్యామ్ ఎడిటింగ్-సత్య గిడుతూరి, కో డైరెక్టర్-నాగ్ అద్దంకి, మాటలు-ఏకే జంపన్న, పాటలు- పుండరీ కాక్ష, సాయిశ్రీసిరి.