Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Pawan-SJ Surya Movie First Shedule may Starts In Pollachi


తాజాగా పూజా కార్య‌క్ర‌మాలు లాంఛ‌నంగా జ‌రుపుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్- ఎస్. జె సూర్య కాంబినేష‌న్ లో రానున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ దాదాపు గా పూర్త‌య్యాయి. అన్ని ప‌నులు కంప్లీట్ చేసుకుని సినిమాను జూన్ 10నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాల‌న్న‌ది మూవీ టీమ్ ప్లాన్. అయితే ఈ సినిమాకు సంబంధించిన మొద‌టి షెడ్యూల్ పొలాచి లో జ‌రుగ‌నుంద‌ని, దీనిలో ప‌వ‌న్ తో పాటు శృతి కూడా పాల్గొనే అవ‌కాశాలున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. పైగా పొలాచీ అనే సెంటిమెంట్ ప‌వ‌న్ కు కొంచెం ఎక్కువే. ఇక్క‌డ గానీ షూటింగ్ జ‌రిగితే ఆ సినిమా హిట్ అవుతుంద‌ని ఆయ‌న న‌మ్మ‌కం. స‌ర్దార్ లో అక్క‌డ తెర‌కెక్కించిన అంశాలు ఏవీ లేక‌పోవ‌డమే సినిమా డిజాస్ట‌ర్ కి కార‌ణాలుగా ప‌వ‌న్ స‌న్నిహితులు చెబుతున్నారు. అందుకే ఫ‌స్ట్ షెడ్యూల్ ను పొలాచీ కి షిఫ్ట్ చేశార‌ట‌. ఈ షెడ్యూల్ లో హీరో, హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ సీన్స్ ని తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తుంది సినీ యూనిట్. సినిమాను ఎక్కువ షెడ్యూల్స్ కాకుండా మూడు, నాలుగు షెడ్యూల్స్ లోనే ముగించాల‌ని డైర‌క్ట‌ర్ ప్లాన్.ఈ క్ర‌మంలోనే మొద‌టి షెడ్యూల్ పొలాచీ లో, మూడ‌వ షెడ్యూల్ ఫారెన్ లో అని నిర్ణ‌యించుకున్నారు. ఈ స్పీడ్ చూస్తుంటే సంక్రాంతికి ముందే ప‌వ‌న్ థియేట‌ర్ల లో తిష్ట వేసేలా ఉన్నాడు.