ప‌వ‌న్ క‌ష్టం వెనుక అస‌లు క‌థ‌


కాట‌మ‌రాయుడు తో ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న త‌దుప‌రి సినిమా త్రివిక్ర‌మ్ తో క‌లిసి చేయ‌నున్నాడ‌న్న విష‌యం తెలిసిందే. ఈసినిమాను వ‌చ్చే ఆగ‌స్టు 15నాటికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ దింపేయాల‌ని చూస్తున్నాడ‌ట ప‌వ‌న్. దీనికోసం రోజుకు 12 గంట‌లు నిర్విరామంగా క‌ష్ట‌ప‌డుతున్నాడు ప‌వ‌న్. ఎన్న‌క‌ల స‌మ‌యానికి తాను క‌మిట్మెంట్ ఇచ్చిన సినిమాల‌న్నింటినీ పూర్తి చేసేయ్యాల‌న్న‌దే ప‌వ‌న్ ఆలోచ‌న అని తెలుస్తుంది. 

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో ప‌వ‌న్ పై కొన్ని యాక్ష‌న్ సీన్స్ ను తెర‌కెక్కిస్తున్నాడు త్రివిక్ర‌మ్. ఏదో కొత్త సినిమా మొద‌లుపెట్టాం క‌దా అని ఇలా రోజుకు 12 గంట‌లు ప‌నిచేయ‌ట్లేదు. సినిమా అయిపోయేంత వ‌ర‌కు ఇలానే రోజుకు 12 గంట‌లు షూటింగ్ లో పాల్గొన‌నున్నాడ‌ట ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆగ‌స్టు 15 సంద‌ర్భంగా, ఈసినిమాను ఆగ‌స్టు 11న విడుద‌ల చేస్తే సెల‌వులు కూడా ఉంటాయి కాబ‌ట్టి కలెక్ష‌న్స్ కు కొదువ ఉండ‌దు అన్న‌ది అస‌లు ప్లాన్. 

దీనికోస‌మే సినిమాను ఎలాగైనా జులై ఫ‌స్ట్ వీక్ నాటికి షూటింగ్ ను పూర్తి చేసేయాలి అన్న‌ది ఇప్పుడు ప‌వ‌న్ ముందున్న టార్గెట్. జులై అంటే ఇంకా మూడు నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌టంతో ప‌వ‌న్ త‌ప్ప‌క క‌ష్ట‌ప‌డాల్సిన ప‌రిస్థితి. దీనికోసం ప‌వ‌న్ కు రెమ్యూన‌రేష‌న్ కూడా బాగానే గిడుతుంద‌ట లెండి.