ఇలా అయితే ప‌వ‌న్ ప‌రువు పోవ‌డం ఖాయం..


సర్దార్ గబ్బర్ సింగ్బ.. పవన్ కెరీర్ లోనే మరచిపోలేని డిజాస్టర్. అయితే ఈ సినిమా వల్ల పవర్ స్టార్ కి వచ్చిన నష్టం ఏమి లేదు కానీ , ఆ సినిమాని కొన్న  బయ్యర్స్ మాత్రం బజారున పడిపోయారు. ఒక్కో ఏరియాలో అయితే సర్ధార్ పెట్టుబడిలో సగం కూడా కలెక్ట్ చేయలేక బయ్యర్స్ కి కన్నీరు పెట్టించింది . అయితే ఆ సినిమా కొని నష్టపోయిన బయ్యర్స్ కే  కాటమరాయుడి సినిమా  హక్కులు ఇస్తామని అప్పట్లో పవర్ స్టార్ హామీ ఇచ్చి ఓదార్చారు. అయితే  ఇప్పుడు పవర్ స్టార్ పక్కన ఉండే మనుషులు ఆ మాట మారుస్తున్నారంటూ  కృష్ణా జిల్లా బయ్యర్ సంపత్ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘నేను సర్ధార్ కృష్ణా జిల్లా రైట్స్ రూ.4.5కోట్లతో కొన్నాను. వచ్చిన షేర్ రూ.2.58కోట్లు మాత్రమే. దగ్గర దగ్గర  రూ.2కోట్లు నష్టం వచ్చింది. మాకొచ్చిన నష్టాన్ని పవన్ దృష్టిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే.. నష్టపోయిన వారిని ఆదుకునేందుకు వెంటనే పవన్ బాబు సినిమా తీస్తున్నారని చెప్పారు. మేం చాలా ఆనందించాం. ఆ సినిమారైట్స్ మాకిస్తామని చెప్పారు. ఏడాదిగా ఎదురు చూస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో కలవమన్నారు. అప్పటి నుంచి ప్రయత్నిస్తుంటే.. శరద్ మురార్.. పవన్ కార్యాలయంలోని శ్రీనివాస్ ఫోన్ ఎత్తటం లేదు. మెసేజ్ లకు స్పందించటం లేదు. నాలాంటి వాడికి రూ.2కోట్ల నష్టం అంటే సామాన్యమైన విషయమే. నా పరిస్థితుల్లో వేరే వారు ఉంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయేవారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సంపత్ .మరి ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు అన్న కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ స్వయంగా రంగంలోకి దిగైనా సర్ధార్ బాధితులకు న్యాయం చేస్తారో లేదో చూడాలి.