ఛ‌ల్ ఛ‌ల్ గుర్రం చిత్ర యూనిట్ ను అభినందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌


శైలేష్, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన పాత్రల్లో ఎం.ఆర్. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మోహన ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఛల్ ఛల్ గుర్రం’. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా ఆడియో, ట్రైల‌ర్ ల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. ఇప్పుడు స్వ‌యానా పవ‌న్ క‌ళ్యాణ్ ఈ చిత్ర బృందాన్ని అభినందించారు. ట్రైలర్ బాగా ఆక‌ట్టుకుంది. ఇలాంటి సినిమాను నిర్మించిన రాఘ‌వ‌య్య ను ఆయ‌న ప్ర‌త్యేకంగా అభినందించారు. డైర‌క్ట‌ర్ మోహ‌న్ సినిమాను బాగా తెర‌కెక్కించాడ‌ని, పాట‌ల‌న్నీ బాగున్నాయని, దీపావ‌ళికి విడుద‌లయ్యే ఈ సినిమా ప్ర‌తీ ఒక్క‌రినీ అల‌రిస్తుంంద‌ని ఆయ‌న అన్నారు.
హీరోః శైలేష్ బొలిశెట్టి హీరోయిన్స్ః దీక్షా పంత్, అంగ‌నా రాయ్ ఇత‌ర తారాగ‌ణంః నాగ‌బాబు, బెన‌ర్జీ,ముక్త‌ర్ ఖాన్, ప్ర‌వీణ్‌, సుడిగాలి సుధీర్, చిత్రం శ్రీను,అశోక్ కుమార్ కొరియోగ్ర‌ఫీః ర‌ఘు మాస్ట‌ర్, ప్ర‌దీప్ ఆంటోనీ మాస్ట‌ర్, భాను మాస్ట‌ర్ ఎడిట‌ర్ః శంక‌ర్ సినిమాటోగ్ర‌ఫీః వి. శ్యామ్ ప్ర‌సాద్ ఆర్ట్ః జె.కె. మూర్తి సంగీతంః వెంగి ఫైట్స్ః రామ్ సుంక‌ర ప్రొడ్యూస‌ర్ః రాఘ‌వయ్య‌ క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః మోహ‌న ప్ర‌సాద్