ప‌వ‌న్ సినిమా రీమేక్ కాదు


కాట‌మ రాయుడు చిత్రం త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఎలాగైనా స‌రే ఈ సినిమాను ఆగ‌స్టులో దింపేయాల‌ని చూస్తున్నారు ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ లు. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ త‌మిళ ద‌ర్శ‌కుడు నేస‌న్ తో క‌లిసి ప‌ని చేయాల్సి ఉంది. ఈ సినిమా త‌మిళంలో పెద్ద విజ‌యం సాధించిన వేదాళ‌మ్ కు రీమేక్ అన్న విష‌యం తెలిసిందే. 
 
నేస‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసిన త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కందిరీగ డైర‌క్ట‌ర్ సంతోష్ శ్రీనివాస్ తో సెట్స్ పైకి వెళ్ల‌నున్నాడు. సంతోష్ శ్రీనివాస్ తో కూడా ప‌వ‌న్ న‌టించబోయే సినిమా రీమేక్ అనే ప్ర‌చారం బాగానే జ‌రిగింది. ఈనేప‌థ్యంలోనే ప‌వ‌న్ స‌న్నిహితులు స్పందించి ,సంతోష్ తో చేసే సినిమా రీమేక్ కాద‌ని, స్ట్ర‌యిట్ తెలుగు సినిమా యేనని చెబుతున్నారు. సంతోష్ చెప్పిన స్టోరీ చాలా ఫ్రెష్ గా ఉండ‌టంతో పాటూ, ప‌వ‌న్ కు తెగ న‌చ్చేసింద‌ట‌. దీంతో ప‌వ‌న్ వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని స‌మాచారం. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి.