ఆ ఒక్క దానికి పవన్ కళ్యాణ్ బానిస అయిపోయాడట!


 కోట్లకి కోట్లు రెమ్యున్ రేషన్ తీసుకునే పవన్ కళ్యాణ్ కి ఇంకా చాలా అప్పులు ఉన్నాయి అన్న టాక్ గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. అయితే పవర్ స్టార్ కి అప్పులు ఉన్నాయా ? ఆస్తులు ఉన్నాయా ? అమ్మ విషయాలను పక్కన పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లివింగ్ స్టైల్ మాత్రం చాలా నార్మల్ గా ఉంటుంది. తిండి దగ్గర నుండి, కట్టే బట్ట వరకు పవన్ చాలా సింపుల్ గా కనిపిస్తుంటారు. అన్ని విషయాల్లో ఇంత సింపుల్ గా ఉండే పవర్ స్టార్ ఒక్క ఫోన్ విషయంలో మాత్రం రిచ్ గా ఆలోచిస్తాడట . కేవలం ఐ ఫోన్ ని మాత్రమే వాడతాడట.  


రాజకీయాల పుణ్యమా అంటూ గత కొంత కాలంగా పవర్ స్టార్  ట్విట్టర్‌లో యాక్టివ్‌గా స్పందిస్తున్నాడు. ఇటీవల ఏపీ స్పెషల్ స్టేటస్‌పై ట్విట్టర్‌నే వేదికగా చేసుకుని మాటల అస్త్రాలను సంధించాడు. ట్విట్టర్‌లో అంత యాక్టివ్‌గా ఉండే  పవన్.. నిజంగా మంచి ఫోన్ నే వాడాలి . అందుకే పవర్ స్టార్ ఇప్పుడు  ఐఫోన్ 6+ వాడుతున్నాడట తన భార్యతో ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు ఆ ఫోన్‌ను కొనుక్కున్నాడట. పుస్తకాలు చదవడమే కాకుండా.. పవన్ మ్యూజిక్ లవర్ కూడా. దీంతో.. ఐట్యూన్స్‌ను విరివిగా వినియోగిస్తున్నాడట. అలాగే బోలెడన్నీ పుస్తకాలను పీడీఎఫ్ ఫార్మాట్లో తన ఐఫోన్ 6+ ఫోన్లో నిక్షిప్తం చేసుకున్నాడట. 


ఇక, రాజకీయ పరంగా ట్వీట్లు పెట్టేందుకు కూడా ఆ ఫోన్‌నే ఎక్కువగా వినియోగిస్తున్నాడట. కుటుంబ సభ్యులకు మాత్రం పేపర్‌ పై రాసి.. ఫొటోను తీసి సందేశాలను పంపుతాడట. ఏదో సందర్భం తప్పితే తప్ప.. మెసేజ్‌లను మాత్రం అస్సలు ఉపయోగించుకోడట పవర్ స్టార్. ఇలా అన్ని అవసరాలు ఈ ఒక్క ఫోన్ ద్వారానే తీరిపోతుండటంతో పవర్ స్టార్ ఈ ఫోన్ కి బానిస అయిపోయాడు అన్న టాక్ వినిపిస్తుంది.  ఏదేమైనా ఇంత స్టార్ డం అనుభవిస్తున్నా, ఇంత సింపుల్ గా లైఫ్ ని లాగించేయడం ఒక్క పవర్ స్టార్ కే  చెల్లింది అని చెప్పుకోవచ్చు.