ప‌వ‌న్ ఫ్యాన్స్ 'శృతి' మించుతున్నారు


ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి ఏదైనా సినిమా వ‌స్తుంది అంటే చాలు, ఆయ‌న అభిమానుల‌కు పండ‌గే. ఫ‌స్ట్ లుక్ నుంచి, రిలీజ్ అయ్యి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే వ‌ర‌కు అంతా తామై చూసుకుంటారు. అలాంటి ప‌వ‌న్ ఫ్యాన్స్ ఇప్పుడు కొంచెం అస‌హ‌నానికి లోన‌య్యార‌ట‌. దానికి కార‌ణం ఇటీవ‌ల జ‌రిగిన కాట‌మ‌రాయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు  ఆ సినిమా హీరోయిన్ అయిన శృతిహాస‌న్ హాజ‌రు కాక‌పోవ‌డ‌మే అంటున్నారు. 

చాలా సంద‌ర్భాల్లో ప‌వ‌న్ త‌న‌కు ఎంతో స్పెష‌ల్ అన్న శృతి, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాక‌పోవ‌డం వెనుక అస‌లు కార‌ణం ఏముందో తెలీదు కానీ, ప‌వ‌న్ ఫ్యాన్స్ మాత్రం ఆ విష‌యంలో కాస్త నిరాశ చెందార‌నే చెప్పాలి. గ‌బ్బ‌ర్ సింగ్ వ‌ర‌కు ఒక్క‌టి కూడా స‌రైన హిట్ లేక ఐర‌న్ లెగ్ అని బిరుదు తెచ్చేసుకున్న శృతికి గ‌బ్బ‌ర్ సింగ్ రూపంలో ప‌వ‌న్ మాంచి హిట్ తో పాటూ ఆ పేరును కూడా తుడిచేశాడు. అలాంటి ప‌వ‌న్ సినిమాకు సంబంధించిన ఫంక్ష‌న్ కు శృతి హాజ‌రు కాక‌పోవ‌డంతో ఆయ‌న అభిమానులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.