Pawan A Real Life Hero


వ‌ప‌న్ రియ‌ల్ లైఫ్ హీరో
రీల్ లైఫ్ లోనే కాదు, రియ‌ల్ లైఫ్ లోనూ త‌ను ఒక మాన‌వ‌త్వం ఉన్న మ‌నిషిన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలాసార్లు నిరూపించుకున్నాడు. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తోనూ, ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే ఎంతో మందికి త‌నవంతు సాయాన్ని అందించి త‌న మంచి మ‌న‌సును చాటుకున్నారు. అలాంటి ప‌వ‌ర్ స్టార్ తాజాగా స‌మాజానికి ప‌నికొచ్చే ఒక మంచి పుస్త‌కం మ‌లి ముద్ర‌ణ‌కి అయిన ఖ‌ర్చును భ‌రించారు.
తెలుగు న‌వలా సాహిత్యంలో మేరు ప‌ర్వ‌తంలా క‌న్పించే గుంటూరు శేషేంద్ర శ‌ర్మ ర‌చ‌న‌ల్లో 'ఆధునిక మ‌హాభార‌త పుస్త‌కం' ఈ మ‌ధ్య సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ లో క‌నిపిస్తే త్రివిక్ర‌మ్ దాన్ని కొని చ‌దివి, ఆ పుస్త‌కం నుంచి నేనెంతో స్పూర్తిని పొందా అని ప‌వన్ కి చెప్పి ఆ పుస్త‌కాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ఇవ్వ‌గా, ఆ పుస్తకంలోని క‌థా వ‌స్తువు ఆలోచింప‌చేసేదిగా ఉండ‌టంతో, మార్కెట్ లో దాని గురించి ప‌వ‌న్ ఆరా తీయ‌గా ఆ బుక్ అందుబాటులో లేద‌ని తెలిసింద‌ట‌.
అంత గొప్ప పుస్తకం అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప‌వ‌న్ వెంట‌నే శేషేంద్రశర్మ కుమారుడితో మాట్లాడి, 'ఆధునిక మహాభారతం' మలి ముద్రణకి ఏర్పాట్లు చేయమనీ, 25000 పుస్తకాలకి అయ్యే మొత్తం ఖ‌ర్చును తానే భరిస్తానని మాట ఇచ్చారట. ఎలాగైతే ఏమి ప‌వ‌న్ ద్వారా ఒక గొప్ప పుస్త‌కం త్వ‌ర‌లో మార్కెట్ లోకి రాబోతోంద‌న్న‌మాట‌.