Parineeti Is Ready To Dance With Mahesh


Parneeti chopra has her separate stardom in Bollywood. Now it's official that she is acting in her first south film.she gave green signal to work with Tollywood super star Mahesh babu. We know that Tamil director Murgadoss is working with Mahesh babu for a new movie which is releasing in Telugu, Tamil and Hindi languages. They searched for many heroines but finally selected Parneeti as female lead.
From July 15 a song is going to picturise on the lead pair. A huge set also being ready for this song shoot at Annapurna Studios. Sources are thinking that this movie will change that Mahesh babu image to another level.
మ‌హేష్ తో పాటేసుకోనున్న ప‌రిణీతి
బాలీవుడ్ లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప‌రిణీతి చోప్రా ద‌క్షిణాదిలో న‌టించే మొద‌టి సినిమా క‌న్ఫార్మ్ అయింది. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌ర‌స‌న న‌టించ‌డానికి ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. త‌మిళ ద‌ర్శ‌కుడు మురుగుదాస్ డైర‌క్ష‌న్ లో మ‌హేష్ హీరోగా ఓ భారీ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో భారీ బ‌డ్జెట్ తో నిర్మించే ఈ సినిమాలో హీరోయిన్ కోసం ప‌లువురిని ప‌రిశీలించిన పిమ్మ‌ట ప‌రిణీతిని ఫైన‌ల్ చేశారు.
ఇదిలా ఉండ‌గా జులై15 నుంచి ఈ సినిమా షూటింగ్ లో భాగంగా హీరోహీరోయిన్ల‌పై ఓ పాట‌ను షూట్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. దీనికోసం హైద‌రాబాద్ లోని అన్న‌పూర్ణా స్టూడియోస్ లో ఒక భారీ సెట్ కూడా వేస్తున్నారు. సినిమా మొద‌ల‌వ‌క‌ముందే ఇన్ని ప్ర‌త్యేక‌త‌ల‌ను సంత‌రించుకున్న ఈ సినిమా మ‌హేష్ బాబు ఇమేజ్ ను మ‌రింత‌ ఎత్తుకు తీసుకెళ్తుంద‌ని భావిస్తున్నారు.