నేడే పైసా వసూల్ ఆడియో విడుదల


పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా  శ్రేయ, కైరాదత్ హీరోయిన్లుగా వస్తున్న చిత్రం ‘పైసా వసూల్’.  భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీత దర్శకుడు. సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదిన ఈ మూవీ విడుద‌ల కానుంది.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన స్టంపర్ మరియు టైటిల్ ప్రోమో సాంగ్ కి మంచి స్పందన లభించింది. ఈ రోజు ఈ సినిమా ఆడియో లాంచ్ ఖమ్మంలో నిర్వహిస్తున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బాలయ్య నటించిన సినిమా అవటంతో అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ చాల స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.