యూట్యూబ్ లో అరకోటి వ్యూస్ సాధించిన బాలయ్య ట్రైలర్


నందమూరి బాలకృష్ణ 101వ చిత్రంగా, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ' పైసావసూల్ ' తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన పైసావసూల్ సినిమా ట్రైలర్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే యూట్యూబ్ లో అరకోటి వ్యూస్ పొందింది ఈ చిత్రం యొక్క ట్రైలర్. బాలయ్య నటన, పూరి మార్క్ డైలాగులు ఈ ట్రైలర్ ని ప్రేక్షకులని మళ్ళీ మళ్ళీ వీక్షించేలా చేస్తున్నాయి. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం కూడా అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియా శ‌ర‌ణ్, కైరా ద‌త్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భవ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి ఆనంద్ర ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1 న విడుదల కాబోతుంది.