తెలుగులో విడుదల కానున్న రెహమాన ‘ఒరు ముగత్తిరై’


తమిళ నటుడు రెహమాన తెలుగువారికి బాగా సుపరిచితుడే. ఆయన నటించిన ‘16 - ఎవ్రీ డీటైల్‌ కౌంట్స్‌’ ఇటీవల తెలుగులో విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. అటు విమర్శకుల ప్రశంసల్ని, ఇటు బాక్సాఫీసు వసూళ్లను కూడా రాబట్టుకుంది. రెండో వారంలోనూ చక్కటి థియేటర్లలో, మంచి వసూళ్లతో ప్రదర్శితమవుతోంది. ‘16-ఎవ్రీ డీటైల్‌ కౌంట్స్‌’ చిత్రానికి గానూ మిగిలిన అందరితోనూ పోలిస్తే రెహమానకు మరింత మంచి పేరు వచ్చింది. తాజాగా ఆయన నటించిన ‘ఒరు ముగత్తిరై’ తెలుగులోకి అనువాదం కానుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రాన్ని వేసవికి విడుదల చేయనున్నారు. డి.వెంకటేశ ఈ చిత్రం హక్కులను తీసుకున్నారు. డీవీ సినీ క్రియేషన్స పతాకంపై ఈ సినిమాను ఆయన తెలుగులో విడుదల చేస్తున్నారు. జీవా, కాజల్‌ నటించిన ‘ఎంతవరకు ఈ ప్రేమ’ చిత్ర నిర్మాత ఇతనే. ‘ఒరు ముగత్తిరై’కు సెంథిల్‌నాథన దర్శకత్వం వహించారు. ఇది థ్రిల్లర్‌ చిత్రం. ఓ సైకియాట్రిక్‌ డాక్టర్‌కి సంబంధించిన కథ ఇది. సైకాలజీ విద్యార్థిని ఇష్టపడి మానసికంగా ఇబ్బందులకు గురైన సైకియాట్రిక్‌ డాక్టర్‌కు సంబంధించిన కథతో తెరకెక్కింది. అదితి, దేవికా మాధవన, ఢిల్లీ గణేశ, మీరా కృష్ణన ఇందులో కీలక పాత్రధారులు.