ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల


మోహన్ బాబు కొడుకుగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన మంచు మనోజ్,  వైవిధ్యమైన కథలను ఎంచుకోంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్నాడు. తాజాగా ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్ర పోషించనున్నాడు. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తుండగా.. స్టూడెంట్ క్యారెక్టర్ కోసం దాదాపు 12 కేజీలు తగ్గడం విశేషం. ఇటీవల విడుదల అయిన టీజర్ కి మంచి స్పందన లభించింది. ఈ సినిమా ట్రైలర్ ని ఆగష్టు 19 న ఉదయం 8: 45 గంటలకి విడుదల చేయబోతున్నాం అని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: పి.ఎస్.వర్మ, సినిమాటోగ్రాఫర్: వి.కోదండ రామరాజు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ, నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్, దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూత