అక్టోబర్ 6 కి వాయిదా పడ్డ ఒక్కడు మిగిలాడు


రాకింగ్ స్టార్ మంచు మంచు మనోజ్ ప్రస్తుతం ఒక్కడు మిగిలాడు చిత్రం లో నటిస్తున్నాడు. కొన్ని నెలలుగా ఈ మూవీ సెట్స్ ఫై నడుస్తుంది. ఈ మూవీ లో మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వం వహించారు.


ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా , సీజీ వర్క్ పెండింగ్ ఉండడం తో సినిమా రిలీజ్ ని అక్టోబర్ 6కి వాయిదా వేశారు. ఈ చిత్రంలో మంచు మనోజ్ సరసన అనీషా ఆంబ్రోస్ నటిస్తుంది.