సెన్సార్ కు సిద్ధ‌మైన‌ `నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్‌`


 శ్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రిమ్మ‌ల‌పూడి వీర‌గంగాధ‌ర్ నిర్మిస్తున్న చిత్రం `నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్‌`. ర‌విచంద్ర క‌న్నికంటి ద‌ర్శకుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు. అర్జున్ మ‌హి, అశ్విని జంట‌గా న‌టిస్తున్నారు. సుమ‌న్ జూపూడి సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఆడియో ఇటీవ‌ల విడుద‌లై సూప‌ర్ హిట్ గా నిలిచింది. త్వ‌ర‌లో సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి  విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.


 ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ర‌విచంద్ర క‌న్నికంటి మాట్లాడుతూ...``ల‌వ్లీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ గా రూపొందిన మా చిత్ర ఆడియో ఇటీవ‌ల విడుద‌ల చేశాం. పాట‌లు విన్న‌వారంద‌రూ చాలా బావున్నాయంటున్నారు. ముఖ్యంగా మా పాట‌ల‌కు సోష‌ల్ నెట్ వ‌ర్స్క్ లో మంచి కాంప్లిమెంట్స్ ల‌భిస్తున్నాయి. ట్రైల‌ర్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ల‌వ్ స్టోరీ చాలా ఫ్రెష్ గా ఇంత‌కు ముందెన్న‌డు చూడ‌ని విధంగా ఉంటుంది. యూత్ కు మాత్ర‌మే కాకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే చిత్రమిద‌న్నారు.


నిర్మాత వీర‌గంగాధ‌ర్ రిమ్మ‌ల‌పూడి మాట్లాడుతూ...``సుమ‌న్ జూపూడి అందించిన పాట‌లు ఇప్ప‌టికే శ్రోత‌లను అల‌రిస్తున్నాయి. ఆడియో హిట్ కావ‌డంతో సినిమా పై మాకు మ‌రింత న‌మ్మ‌కం ఏర్ప‌డింది.  అర్జున్ మ‌హి, అశ్విని జంట ట్రైల‌ర్స్ లో చాలా క్యూట్ గా ఉందంటున్నారు. మా పాట‌లు, ట్రైల‌ర్స్ విడుద‌లైన ద‌గ్గ‌ర నుంచి బిజినెస్ ప‌రంగా కూడా రెస్పాన్స్ బావుంది. త్వ‌ర‌లో సెన్సార్ కార్య‌క్ర‌మాలూ పూర్తి సినిమాను గ్రాండ్ గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.

థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, కేదార్ శంక‌ర్ .యం, నిర్మల‌, రింగ్ ర‌మేష్‌, గంగాధ‌ర్, రితిక‌, రాధ‌, ఉమ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః వాసు బొజ్జా, సంగీతంః సుమ‌న్ జూపూడి, కొరియెగ్ర‌ఫీః న‌రేశ్ ఆనంద్, పాట‌లుః ధీరేంద్ర‌, ఈమ‌ని, ఎడిట‌ర్ః ర‌వీంద్ర‌బాబు.కె, నిర్మాతః వీర‌గంగాధ‌ర్ రిమ్మ‌ల‌పూడి,క‌థ‌-క‌థ‌నం-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వంః ర‌విచంద్ర క‌న్నికంటి