Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

#ntr27.. ముహుర్తం ఫిక్స్


జ‌న‌తా గ్యారేజ్ ఈ సినిమాతో త‌న కెరీర్ హిట్, ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసిన ఎన్టీఆర్, కొంచెం గ్యాప్ తీసుకుని, ఎట్ట‌కేల‌కు త‌న కొత్త సినిమాను అనౌన్స్ చేసేశాడు. సుమారు 3నెల‌ల విరామం తీసుకున్న ఎన్టీఆర్, చాలా క‌థ‌లు విని, చివ‌ర‌కు బాబీ చెప్పిన క‌థ‌ను ఓకే  చేశాడు. క‌ళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఆల్రెడీ జై ల‌వ కుశ అనే టైటిల్ ను కూడా ఫిల్మ్ ఛాంబ‌ర్ లో రిజిస్టర్ చేయించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేయ‌నుండ‌టంతోనే సినిమాకు ఈ టైటిల్ ను ఖరారు చేశార‌ని స‌మాచారం.  
 
 ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటున్న ఈ చిత్ర ప్రారంభానికి ముహుర్తం కుదిరింది. ఫిబ్ర‌వ‌రి 11, 2017న ఎన్టీఆర్ 27వ సినిమాను పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి, అధికారికంగా లాంఛ్ చేసి, వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. షూటింగ్ కూడా త్వ‌ర‌గా పూర్తి చేసి, ఆగ‌ష్టు నాటికి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తుంద‌ట జై ల‌వ‌కుశ యూనిట్. దేవీశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు, త్రీ ఇడియ‌ట్స్, పీకే, ల‌గేర‌హో మున్నాభాయ్ వంటి చిత్రాల‌కు సినిమాటోగ్ర‌ఫీ అందించిన సీకే ముర‌ళీధ‌ర‌న్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్ర‌ఫీ అందించ‌నున్నారు. ముర‌ళీధ‌ర‌న్ ప‌ని చేస్తున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే కావ‌డం విశేషం. స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కు ఈ సినిమా కూడా త‌న కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచేలా ఉంది.