ఆ కాల్ తో ఆశ్చ‌ర్యపోయిన అంజ‌నాపుత్ర‌


గౌత‌మి పుత్ర శాత‌కర్ణి. బాల‌య్య వందో చిత్రం. డైర‌క్ట‌ర్ క్రిష్ కంచె చిత్రం త‌ర్వాత ఎంతో ప్ర‌తిక‌ష్టాత్మకంగా రూపొందిన చిత్రం. సినిమా మొద‌లు పెట్టిన ద‌గ్గ‌ర‌నుంచి ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ అంటూ ఏదోక వంక‌తో ప్రేక్ష‌కుల నోళ్ల‌లో నానుతూనే ఉంది.అయితే ఇప్పుడు ఉన్న‌ట్లుండి ఇంకో వార్త ఫిల్మ్ న‌గ‌ర్ లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదే ఎన్టీఆర్ క్రిష్ కు ఫోన్ చేయ‌డం..తార‌క్ ఫోన్ తో క్రిష్ ఏకంగా షాక్ కు గురయ్యాడ‌ట‌. అయితే అస‌లు తార‌క్, క్రిష్ తో ఏం మాట్లాడాడా అన్న‌ది ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది.
శాత‌క‌ర్ణికి సంబంధించిన వీడియో ఫుటేజి ఏదైనా ఉంటే చూడాల‌ని ఎన్టీఆర్ క్రిష్ ను అడిగాడ‌ట‌. అస‌లే ఎన్టీఆర్ ఫోన్ తో ఆశ్చ‌ర్యంలో ఉన్న క్రిష్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఫుటేజీల‌ను చూడొచ్చ‌ని, అంతే కాకుండా ఆ సినిమాకు సంబంధించిన ప‌లు ప్ర‌త్యేక విష‌యాల‌ను కూడా క్రిష్ తార‌క్ తో ముచ్చ‌టించాడ‌ట‌. ఆల్రెడీ శాత‌క‌ర్ణి టీజ‌ర్ చూసిన త‌ర్వాత బాల‌య్య త‌ప్ప ఆ పాత్ర‌కు వేరెవ్వరూ న్యాయం చేయ‌లేర‌ని చెప్పడం, ఇప్పుడు ఇలా ఫోన్ చేసి వీడియో ఫుటేజీ అడ‌గ‌డం ఇదంతా చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది ఎన్టీఆర్ ఆ సినిమా కోసం ఎంత‌గా ఎదురుచూస్తున్నాడో.. అంద‌రూ ఎంత‌గానో వేచిచూస్తున్న ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.