Latest News

ఈనెల 30 న సంపూర్ణేష్ బాబు ' వైరస్' విడుదల. 'మామ్‌' సెన్సార్‌ పూర్తి - జూలై 7 విడుదల జూలై 7న డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 'రాక్షసి' అట్యిట్యూడ్ వ‌ల్లే గ‌బ్బ‌ర్‌సింగ్ వ‌చ్చింది. గబ్బ‌ర్‌సింగ్ వ‌ల్ల నాకు అట్యిట్యూడ్ రాలేదు : హ‌రీష్ శంక‌ర్ వంద‌కోట్లు అనేది నంబ‌ర్ కాదు. అంత మంది ప్రేక్ష‌కుల ప్రేమ : అల్లు అర్జున్ మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా డీజే.. 100 కోట్లు సాధించ‌డం ఆనందంగా ఉంది - దిల్‌రాజు విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన 'ఏజంట్‌ భైరవ' జూలై 7న విడుదల ఈరోజు నిన్నుకోరి సినిమా జ్యూక్ బాక్స్ విడుదల. జై లవ కుశ టీజర్ మరియు సినిమా విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్. గ్లామర్ తో తెలుగు సినీ పరిశ్రమకి గాలం వేసిన పూజ హెగ్డే

NTR is The Best Dancer- Mahesh


డ్యాన్స్. యువ‌త ను ఉర్రూత‌లూగించే క‌ళ‌. అది కూడా త‌మ అభిమానుల డ్యాన్స్ అంటే ఇక గాల్లోనే ఉంటారు. తెలుగు ఇండ‌స్ట్రీలో ఎన్టీఆర్, అల్లుఅర్జున్, రామ్ చ‌ర‌ణ్ ఇలా చెప్పుకోద‌గ్గ స్టార్ డ్యాన్స‌ర్స్ చాలా మందే ఉన్నారు.  డ్యాన్స్ కి ఫ్యాన్స్ అయిన ఎవ‌రైనా స‌రే వీరి డ్యాన్స్ కు ఫిదా అయిపోవాల్సిందే. ప్రేక్ష‌కుల దగ్గ‌ర నుండి పెద్ద పెద్ద స్టార్స్ వ‌ర‌కు అంద‌రూ వీళ్ల‌కు ఫ్యాన్సే.
మొన్న‌టికి మొన్న ఎన్టీఆర్ , చ‌ర‌ణ్ లాగా డ్యాన్సులు నా వ‌ల్ల కాదు అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నాడు. అంటే వాళ్లిద్ద‌రూ బెస్ట్ డ్యాన్స‌ర్స్ అని ప‌వ‌న్ చెప్ప‌క‌నే చెప్పాడు. ఇప్పుడు తాజాగా మ‌హేష్ బాబు కూడా అదే మాట‌న్నాడు. తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న‌వారిలో బెస్ట్ డ్యాన్స‌ర్ ఎవ‌రు అని అడిగితే ఎన్టీఆర్ అని ఆలోచించ‌కుండా చెప్పిన మ‌హేష్.. ఎన్టీఆర్ డ్యాన్సులు బాగుంటాయ‌ని కితాబిచ్చేశాడు.
బ్ర‌హ్మోత్స‌వం సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మీడియాతో ఇంట‌రాక్ట్ అవుతున్న మ‌హేష్ త‌న మ‌న‌సులోని విష‌యాల్ని బ‌య‌ట‌పెడుతున్నాడు. క‌థానాయ‌క‌ల్లో స‌మంత‌, కాజ‌ల్ ఇద్ద‌రంటే ఇష్ట‌మ‌ని, శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో మళ్లీ మ‌ళ్లీ ప‌నిచేయాల‌నుంద‌ని మహేష్ చెప్పాడు.  ఏదైనా ఒక సూప‌ర్ స్టార్ అయుండి వేరే వారిని పొగ‌డ‌ట‌మంటే గ్రేటే మ‌రి. కానీ డ్యాన్సుల్లో నిజంగా మెగాస్టార్ తర్వాత ఆ స్థాయిలో అదరగొడుతున్న కథానాయకులంటే ఎన్టీఆర్ - చరణ్ - అల్లు అర్జున్ లే.