ఆ విష‌యంలో ఎన్టీఆర్ తర్వాతే ఎవ‌రైనా..


తెలుగు సినీ పరిశ్రమకి కొత్త కొత్త స్టెప్పులని పరిచయం చేసి , బ్రేక్ డ్యాన్స్ లతో ఇండస్ట్రీ రికార్డ్స్ కొట్టిన బాస్ ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అని అంతా ఒప్పేసుకుంటారు . ఒప్పుకొని తీరాలి కూడా . అయితే మెగాస్టార్ తర్వాత ఆ రేంజ్ డాన్సులంటే ముందుగా గుర్తుకి వచ్చేది జూనియర్ ఎన్టీఆరే. ఎన్టీఆర్‌కు అల్లు అర్జున్ నుంచి డాన్సుల్లో గట్టిపోటీ ఉన్నా , తారక్ స్టెప్స్ తో పోల్చుకుంటే బన్నీ జిమ్నాస్టిక్స్ కి తరువాత స్థానమే అని చెప్పుకోవాలి.

అయితే డ్యాన్స్ ల విషయంలో హృతిక్ రోషన్ వీరందరికి మాస్టర్ అని చెప్పుకోవచ్చు . ఇక ఇండియన్ మైకేల్ జాక్సన్ అని ముద్దుగా పిలుచుకునే ప్రభుదేవా, లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . అయితే గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో ‘ది టాప్ టెన్స్’ అనే ఆన్‌లైన్ సంస్థ నిర్వహించిన డాన్స్ సర్వేలో దిమ్మ తిరిగే రిజల్ట్స్ వచ్చాయట . ఈ లిస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్‌కు టాప్ స్థానాన్ని కట్టబెట్టారు నెటిజన్లు. భారత సినీ చరిత్రలో ద బెస్ట్ డాన్సర్ పేరిట చేసిన సర్వేలో 22 శాతం ఓట్లతో తారక్ టాప్ ప్లేస్‌ను సాధించాడు. ఈ జాబితాలో చిరంజీవికి పదో స్థానం దక్కింది.ఇక హృతిక్ రోషన్, 11 , అల్లు అర్జున్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక, రామ్‌చరణ్ తేజ్ గురించి చెబితే.. కేవలం 17వ స్థానానికి పరిమతమయ్యాడు. అయితే.. ఈ సర్వేపై మెగా అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి పదో స్థానం రావడం, ఎన్టీఆర్ కి మొదటి స్థానం దక్కడం నిజంగా వారికి మింగుడు పడటం లేదట . మరోవైపు నందమూరి అభిమానులు మాత్రం తమ హీరో టాప్ డ్యాన్సర్ గా నిలవడం తో సంబరాలు చేసుకుంటున్నారు .