జై ల‌వ‌కుశ లో ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్స్ ఇవే..


ఎన్టీఆర్‌ హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుండగా, శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ రోజు టైటిల్‌ లోగోను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. అందరూ అనుకున్నట్లుగానే ‘జై లవ కుశ’ అనే టైటిల్‌నే ఈ చిత్రానికి ఫిక్స్‌ చేశారు. ఎన్టీఆర్‌ ఇందులో త్రిపాత్రాభినయంలో నటిస్తుండగా అందుకు తగ్గట్లుగా పెట్టిన ‘జై లవ కుశ’ అనే టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటుంది.

అంతేకాదు, మోష‌న్ పోస్ట‌ర్ ను గ‌మ‌నిస్తే అస‌లు సినిమా థీమ్ కూడా అర్థ‌మైపోతుంది. మొద‌ట రాముడు క్యారెక్ట‌ర్ తో మొద‌లైన దాన్ని  బ‌ట్టి చూస్తే, ఒక క్యారెక్ట‌ర్ రాముడి పాత్ర‌ను పోలి ఉంటుంది అంటే ప్ర‌జ‌ల కోసం ఏమైనా చేసేవాడిలా ఉంటుందని, రెండ‌వ క్యారెక్ట‌ర్ ల‌క్ష్మ‌ణుడు.. అంటే అన్నే స‌ర్వ‌స్వం అనుకుని, ఎల్ల‌ప్పుడూ అన్న ప‌క్క‌నే ఉంటూ, త‌న‌ను ర‌క్షించేవాడిలా , ఇక‌పోతే మూడో క్యారెక్ట‌ర్ రావ‌ణుడుగా మూడో క్యారెక్ట‌ర్ అంటే ఎన్టీఆర్ విల‌న్ గా విశ్వ‌రూపం చూపించే క్యారెక్ట‌ర్ అన్న‌మాట‌. 

ఇక ఇందులో ఎన్టీఆర్‌ సరసన రాశిఖన్నా ఒక హీరోయిన్ గా నటిస్తుండగా,  మ‌రో కీల‌క పాత్ర‌లో స‌మంత న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. నంద‌మూరి ఆర్ట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ రామ్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈసినిమాకు దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నాడు.  ఇప్ప‌టికే టెంప‌ర్, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తాగ్యారేజ్ చిత్రాల‌తో మాంచి హిట్ల మీదున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో మూడు క్యారెక్ట‌ర్స్ చేస్తున్నాడ‌ని తెలియడంతో ఈ సినిమా ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యంపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ‌గా, ఇప్పుడు రిలీజ్ అయిన ఈ టైటిల్ లోగో అంచ‌నాల‌ను మ‌రింత పెంచేస్తుంది.