మ‌హేష్ కు అస‌లు గ్యాపే లేదు..


బ్ర‌హ్మోత్సవం డిజాస్ట‌ర్ త‌ర్వాత మ‌హేష్ చాలా దూకుడుగా మురుగుదాస్ డైర‌క్ష‌న్ లో కొత్త సినిమాను మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. మొద‌లుపెట్టిన ద‌గ్గ‌ర‌నుంచి ఆప‌కుండా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. మొన్న‌టివ‌ర‌కు వారం పాటూ వియ‌త్నాంలో యాక్ష‌న్ సీక్వెన్స్ చేసుకొచ్చిన మురుగ టీమ్ ఇప్పుడు చెన్నై షెడ్యూల్ ను మొద‌లుపెట్టింది. మామూలుగా అయితే షెడ్యూల్ కు, షెడ్యూల్ కు మ‌ధ్య గ్యాప్ తీసుకుంటారు. కానీ మ‌హేష్ మాంచి క‌సి మీద ఉండ‌టం, సినిమా టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డటంతో అస‌లు విశ్రాంతి అనేదే లేకుండా తెగ క‌ష్ట‌ప‌డుతున్నారు. 

కానీ ఎప్పుడో మొద‌లుపెట్టేసిన సినిమాకు ఇప్ప‌టివ‌ర‌కు ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ రిలీజ్ చేయ‌క‌పోగా, క‌నీసం టైటిల్ ను కూడా ఇప్ప‌టివ‌ర‌కు ఫిక్స్ చేయ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి లోన‌వుతున్నారు. మొత్తానికి ఏప్రిల్ 14న ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది అంటూ ఇప్పుడు మ‌రో కొత్త డేట్ ను వెలుగులోకి తీసుకొచ్చారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న ఈ బైలింగ్యువ‌ల్ లో ర‌కుల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.