ఈ తెల్ల‌తోలు పిల్ల‌ను కొంచెం చూడండ‌య్యా..!


త‌మ‌న్నా. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు.టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ఈమెను ఇప్పుడు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ చిన్న చూపు చూస్తుంద‌నే చెప్పుకోవాలి. మంచి ఆఫ‌ర్లు అనేవి అమ్మ‌డుకు ఆమ‌డ దూరంలో ఉంటున్నాయి. కోలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న త‌మ‌న్నా కు టాలీవుడ్ నుంచి మాత్రం ఒక్క ఆఫ‌ర్ కూడా వెళ్ల‌ట్లేదు. ఏప్రిల్ లో రానున్న బాహుబ‌లి ది కంక్లూజ‌న్ త‌ప్పించి, త‌మ‌న్నా చేతిలో ఏ తెలుగు సినిమా లేదు. తెలుగులో సినిమాలు చేసేందుకు ఎంతో ఉత్సాహం చూపుతున్న త‌మ‌న్నాకు  ఆఫ‌ర్లు  ఇచ్చే నాధుడే క‌రువయ్యారు. 

ఎంత త‌మిళ సినిమాల్లో బిజీగా ఉన్నా, టాలీవుడ్ లో రెమ్యూన‌రేష‌న్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్ర‌తీ స్టార్ హీరోయిన్ తెలుగు లో ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాల‌ని ఆశ ప‌డుతుంటారు. త‌మ‌న్నా కూడా ఆ లిస్ట్ లోనే ఉంది. కానీ ఆఫ‌ర్లు మాత్రం ఆమె చెంత‌కు రావ‌డం లేదు. అయితే బాల‌య్య హీరోగా కేఎస్ ర‌వికుమార్ తెర‌కెక్కించ‌నున్న సినిమా కోసం త‌మ‌న్నాను హీరోయిన్ గా చేయ‌మ‌ని మంత‌నాలు కూడా జ‌రిగాయి కానీ ఆ సినిమా కూడా ఇప్ప‌టివ‌ర‌కు ఇంకా ఫైన‌లైజ్ కాలేదు. టాలెంట్ ఉన్న త‌మ‌న్నా కు ఎవ‌రో ఒక‌రు ఛాన్స్ లు  ఇవ్వాల‌ని ఆశిద్దాం.