జై లవ కుశ మూవీలో నివేదా థామ‌స్


'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో మంచి జోష్ మీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో మరో సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'జై లవ కుశ' అనే టైటిల్ ఖరారు చేసారు. ఇటీవలే  శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్లో కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


ఈ సినిమాలో ఎన్టీఆర్ కి సరసన రాశి ఖన్నా నటిస్తుందని ముందే తెలియజేసిన చిత్ర యూనిట్, మరో హీరో హీరోయిన్ పాత్ర కోసం " జెంటిల్‌మన్‌" ఫేమ్  నివేత థామస్ ని ఎంచుకున్నట్లు అధికారికంగా తెలియజేసారు.