Latest News

వీ.ఐ.పీ2 కోసం నాకు అబద్దం చెప్పారు: కాజోల్ `డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్` పైర‌సీపై సైబ‌ర్ పోలీసుల‌కు పిర్యాదు చేసిన దిల్‌రాజు 28% Gst పై ధ్వ‌జ‌మెత్తిన టీ-ఫిలించాంబ‌ర్ ఆప్ కామ‌ర్స్ అధ్య‌క్ష‌డు ఆర్.కె గౌడ్!! ఈనెల 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న `క‌దిలే బొమ్మ‌ల క‌థ‌` మహేష్ బాబు సినిమా షూటింగ్ లో ధోని హీరోయిన్ ఈనెల 30న అనుష్క ప్రధాన పాత్రగా వస్తున్న 'భాగమతి' ఫస్ట్ లుక్ విడుదల యాక్షన్ కింగ్ అర్జున్ ‘‘కురుక్షేత్రం’’ మూవీ టీజర్ కు రెస్పాన్స్ అదుర్స్ ఆగష్టులో విడుదల కానున్న రాజు గారి గది2 ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 1న సాయి ధరమ్ తేజ్ జవాన్ విడుద‌ల త‌మ్ముడు చ‌నిపోయినా, షూటింగ్ కు వెళ్లాడు..

యూత్‌స్టార్‌ నితిన్‌తో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌లో కె.కె.రాధామోహన్‌ భారీ చిత్రం


 ఏమైంది ఈవేళ, బెంగాల్‌ టైగర్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్‌ మరో భారీ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు. యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై శ్రీమతి లక్ష్మీరాధామోహన్‌ సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది. 

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - ''నితిన్‌తో ఓ సూపర్‌హిట్‌ చిత్రం తియ్యాలన్న ఉద్దేశంతో సబ్జెక్ట్‌ రెడీ చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నితిన్‌... హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా, కృష్ణచైతన్య డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల అనంతరం ఆగస్ట్‌ తర్వాత మా చిత్రం ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము'' అన్నారు.