Nithin Interview About A..Aa Movie


కెరీర్ మొద‌లుపెట్ట‌డ‌మే ఒక స‌క్సెస్‌ఫుల్ డైర‌క్ట‌ర్ తో సినిమా.మొద‌టి సినిమానే పెద్ద హిట్. కానీ త‌ర్వాత‌ మాత్రం అనుకున్నంత విజ‌యాల్ని ఇవ్వ‌కపోవ‌డంతో కాస్త వెనుక‌బ‌డ్డాడు. వ‌రుస‌గా అవ‌కాశాలు రావ‌డం, వ‌చ్చిన సినిమాలు ఫ్లాప్ అవ‌డం ఇవ‌న్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇండస్ట్రీకి వ‌చ్చి 14 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. కానీ గడిచిన 4 సంవ‌త్స‌రాల‌నే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటా అంటున్నాడు నితిన్..
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నితిన్, సమంత, హీరో హీరోయిన్లుగా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఒక కీల‌కపాత్ర‌లో... మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ దర్శకత్వంలో సూర్య దేవర రాధాకృష్ణ నిర్మించిన చిత్రం ‘అ..ఆ’ . ఈ చిత్రం జూన్ 2న విడుదలవుతున్న సందర్భంగా నితిన్ తో ఇంటర్వ్యూ...
అ.ఆ సినిమా గురించి..
అ..ఆ అంటే అన‌సూయ రామ‌లింగం వ‌ర్సెస్, ఆనంద్ విహారి. కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోష‌న్స్ తో త్రివిక్ర‌మ్ మార్క్ తో ఈ సినిమా ఉండ‌నుంది.కొత్త క‌థ అని చెప్ప‌ను కానీ తీసిన విధానం అంద‌రికీ న‌చ్చుతుంది.
మిగిలిన ల‌వ్ స్టోరీస్ కి, ఈ సినిమా స్టోరీ కి తేడా ఏంటి..? 
ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన ల‌వ్ స్టోరీస్ అండ్ యాక్ష‌న్ మూవీస్. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల్లో ఆక‌తాయిగా క‌నిపిస్తా. కానీ ఇందులో కుటుంబం గురించి ఆలోచించే బాధ్య‌త గ‌ల కొడుకుగా క‌నిపిస్తా. ఈ సినిమాలో నాకొక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఉన్నప్పటికీ అందరినీ నవ్విస్తూ ఉంటాను.అన్ని షేడ్స్ లోనూ ప్రేక్ష‌కులు న‌న్ను చూడ‌బోతున్నారు..ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన సినిమాల్లో నాకు చాలా క‌ష్ట‌మ‌నిపించిన పాత్ర ఇదే. త్రివిక్ర‌మ్ గారి స‌హ‌కారంతో నా న‌ట‌న బాగా వ‌చ్చింది.
అ..ఆ అవ‌కాశం ఎలా వ‌చ్చింది..?
గుండెజారి గ‌ల్లంత‌య్యిందే షూటింగ్ త‌ర్వాత హార్ట్ ఎటాక్ షూటింగ్ కోసం స్పెయిన్ షూటింగ్‌లో ఉన్న‌ప్పుడు త్రివిక్ర‌మ్ గారు ఫోన్ చేసి, అత్తారింటికి దారేది త‌ర్వాత మ‌నిద్ద‌రం క‌లిసి సినిమా చేద్దాం అన్నారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల అప్పుడు కుద‌ర‌లేదు. త‌ర్వాత ఒక సంవ‌త్స‌రం త‌ర్వాత, నాకు సినిమాలు లేవే, వేరే సినిమా వెతుక్కోవాలా అన్న టైమ్ లో ఫోన్ చేసి అడిగారు. అంతే, ఇప్పుడిలా అ..ఆ తో మీ ముందుకు రాబోతున్నా..
క‌థ వినే ఓకే అన్నారా.. లేక త్రివిక్ర‌మ్ గారు అడిగారు అని ఓకే అన్నారా..?
నిజం చెప్పాలంటే, నాకెప్ప‌టి నుంచో ఆయ‌న‌తో క‌ల‌సి ప‌ని చేయాల‌ని ఉండేది. అలాంటి వ్య‌క్తి ఫోన్ చేసి న‌న్ను అడిగిన వెంట‌నే ఓకే చెప్పేశా. త‌రువాత వెంట‌నే క‌థ విన్నా. క‌థ కూడా న‌చ్చ‌డంతో ప్రొసీడ్ అయిపోయా.
లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ అని అంటున్నారు..?
ఆ మాట నిజం కాదు. ఇందులో ఉన్న ఏడు, ఎనిమిది క్యారెక్ట‌ర్లు అన్నీ ఇంపార్టెంటే. ప్ర‌తి ఒక్క క్యారెక్ట‌ర్ క‌థ‌ని న‌డిపిస్తుంది.
త్రివిక్ర‌మ్ గారి స్టైల్ లోకి మీరు వెళ్లిపోయారా .. లేక..?
నా స్టైల్ వేరే, వాళ్ల స్టైల్ వేరే అంటూ ఏమీ ఉండ‌దు ఈ సినిమాలో .. అంతా డైర‌క్ట‌ర్ మార్క్ సినిమానే. ప్ర‌తి క్యారెక్ట‌ర్ ని త‌న‌కి కావాల‌సిన విధంగా మ‌ల‌చుకున్నారు. సినిమా మొద‌టి నుంచే ఈ సినిమా కొత్త‌గా ఉండాలి, ప్ర‌తి క్యారెక్ట‌ర్ కొత్త‌గా క‌నిపించాలి అనుకునే మొద‌లుపెట్టారు డైర‌క్ట‌ర్.
మ్యూజిక్ డైర‌క్ట‌ర్ అనిరుధ్ నుంచి మిక్కీ కి ఎందుకు? 
మొద‌ట్లో అనిరుధ్ నే అనుకున్నాం కానీ త‌నకు వేరే ప్రాజెక్ట్స్ ఉండ‌టం వ‌ల్ల మిక్కీని తీసుకున్నాం. కానీ త‌క్కువ టైమ్ లోనే మిక్కీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.
 
త్రివిక్ర‌మ్ గారితో ప‌నిచేశాక చాలా మంది మాలో మార్పొచ్చింది అంటారు. మీరు కూడా ?
చాలా. ఆయ‌నొక జ్ఞాని. మా ఇద్ద‌రి మ‌ధ్య ఇప్పుడు చాలా బంధ‌మేర్ప‌డింది. ఎంత‌గా అంటే రేపు నాకేదైనా స‌మ‌స్య వ‌స్తే నేను ఫ‌స్ట్ ఆయ‌న ద‌గ్గ‌రికే వెళ్లేంత. అది ఆయ‌న ఓదార్పు కోస‌మే కావ‌చ్చు, స‌హాయం కోస‌మే కావ‌చ్చు, స‌లహా కోస‌మే కావ‌చ్చు.
 
టాప్ డైర‌క్ట‌ర్ల‌తో ప‌నిచేసే అవ‌కాశం చాలా ఈజీగా వ‌స్తున్న‌ట్లుందీ..?
ఆ విష‌యంలో నేను ల‌క్కీ. రాజ‌మౌళి గారు, వినాయ‌క్ గారు, త్రివిక్ర‌మ్ గారు. పూరీగారు..నా కెరీర్ లో నేను వర్క్ చేసిన దర్శకుల్లో నా తొలి చిత్రం దర్శకులు తేజగారు, రాజమౌళిగారు వీరి తర్వాత త్రివిక్రమ్ గారితో చేయడం బెస్ట్ గా ఫీలవుతున్నాను.
 
ఇండ‌స్ట్రీకి వ‌చ్చి దాదాపు 15 సంవ‌త్స‌రాల‌యిన‌ట్లుందీ..
అవునండీ.. 14సంవ‌త్స‌రాలు.2011 వ‌ర‌కు అన్నీ ఫ్లాప్ లే. అక్క‌డితే అయిపోయింది. 2012 నుంచి మ‌ళ్లీ నా జ‌ర్నీ మొద‌లైంది. సో జ‌స్ట్ 4 ఇయ‌ర్స్ ఓల్డ్ ఓన్లీ.
 
మ‌రి ఇన్నేళ్ల ప్ర‌యాణంలో ఏం నేర్చుకున్నారు?
నేర్చుకున్నది అంటే నేను ఫ్లాప్ లో ఉన్న‌ప్పుడే. నాకు ఏ పాత్ర న‌ప్పుతుంది, ఏ పాత్ర న‌ప్ప‌దు, నేను ఇంకా ఏం చేయాలి ఇలాంటివ‌న్నీ ఆ టైమ్ లోనే నేర్చుకున్నా.
 
ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు సెట్స్‌కి వ‌చ్చారు కదా.. ఎలా అనిపించింది?
ఆయ‌నొస్తున్న విష‌యం నాకు తెలియ‌దు. అత‌ని ముందే ఒక డ్యాన్స్ షాట్ చేయాల్సొచ్చింది. ఒక‌వైపు భ‌యంగా, మ‌రొక‌వైపు ఆనందంగా చేసేశా..
అఖిల్ నిరాశ ప‌రిచిందా..?
చాలా. సినిమా రిలీజ్ అయినా నాలుగైదు నెల‌ల వ‌ర‌కు అస‌లు నిద్ర కూడా ప‌ట్ట‌లేదు. సినిమా ఫ్లాప్ అయింది,డ‌బ్బులు పోయాయి అని కాదు. ఒక కొత్త హీరో మొద‌టి సినిమానే అలా అయ్యే స‌రికి చాలా బాధగా అనిపించింది.
 
అ..ఆ లో ఎలా క‌నిపించ‌బోతున్నారు?
ఇప్ప‌టివ‌రకూ ఎవ‌రూ క‌నిపించ‌ని విధంగా. సినిమాలో నేనొక చెఫ్.అన్ని షేడ్స్ ఉంటాయి.
 
ప్రొడ‌క్ష‌న్ కంటిన్యూ చేస్తారా..?
త‌ప్ప‌కుండా.. నా త‌ర్వాత సినిమా మా సొంత బ్యాన‌ర్ లోనే ఉంటుంది.
 
సినిమాలో వంటోడిని అన్నారు.. నిజ‌జీవితంలో కూడా వంట వ‌చ్చా..?
అస్స‌లు రాదు. ఎవ‌రైనా బాగా వండిపెడితే నేను బాగా తినిపెడ‌తా అంతే.
 
గుండెజారి సీక్వెల్ చేస్తున్నార‌న్నారు?
స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. సెకండ్ పార్ట్ క‌థ బాగుంటే చేస్తాం లేకుంటే లేదు. ఫ‌స్ట్ పార్ట్ అంత హిట్ పెట్టుకుని, మ‌ళ్లీ సెకండ్ పార్ట్ ఎలా ప‌డితే అలా తీస్తే ఆ సినిమాకి ఉన్న క్రేజ్ కూడా పాడ‌వుతుంది.
 
ఇంట్లో పెళ్లి గురించి ఒత్తిడి చేయ‌ట్లేదా?
వాళ్లు చేస్తూనే ఉన్నారు రెండేళ్ల నుంచి. కానీ నేనెప్ప‌టిక‌ప్పుడు వ‌చ్చే సంవ‌త్స‌రం అని చెప్తూ త‌ప్పించుకుంటున్నా. చూద్దాం ఇంకెన్ని రోజులు అలా చెప్ప‌గ‌ల‌నో.
 
నితిన్, నేను చాలా క్లోజ్ అని స‌మంత చాలాసార్లు చెప్పింది. మ‌రి త‌న మ‌న‌సులోని అబ్బాయెవ‌రో చెప్పిందా?
లేదు. ప‌ర్స‌న‌ల్ విష‌యాలు చెప్పుకునేంత క్లోజ్ కాదు. ఆ విష‌యం మీరు స‌మంత‌నే అడ‌గండి.
మీకు తెలియ‌కుండా ఉండ‌దు క‌దా..!
అందరికీ తెలుసుక‌దా,మీకూ తెలుసు క‌దా. ఇంకెందుకు
 
సినిమా గురించి ఏమైనా టెన్ష‌న్ గా ఉందా?
చాలా టెన్ష‌న్ గా ఉంది. ఈ సినిమా హిట్ నాకు చాలా అవ‌స‌రం. జూన్ 2 కోసం మీ అంద‌రికంటే నేనే ఎక్కువ ఎదురుచూస్తున్నా.