నితిన్ తో జత కట్టనున్న నాని హీరోయిన్


ప్రస్తుతం హీరో నితిన్ హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ బ్యానర్ వారి నిర్మాణంలో లై అనే సినిమా షూటింగ్  యునైటెడ్ స్టేట్స్ లో  బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చిన వెంటనే ప్రముఖ గేయ రచయిత అయిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ మరియు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా  నిర్మించబోతున్నారు.

లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాలో నితిన్ కి సరసన పంజాబీ భామ మెహరీన్ ను ఎంచుకున్నట్లు సమాచారం. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ భామ, తెలుగు, తమిళ్ మరియు హిందీ చిత్రాల్లో బిజీ గా ఉంది. మెహ్రీన్ ఈ సినిమాలో నటిచటం గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.