Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Nikhil's Ekkadiki Pothavu Chinnavaada Fist Look


నిఖ‌ల్‌, వి.ఐ.ఆనంద్‌,మేఘ‌న ఆర్ట్స్ కాంబినేష‌న్ చిత్రం' ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'
స్వామిరారా, కార్తికేయ‌, సూర్య vs సూర్య లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో వ‌రుస సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో టాలీవుడ్ ట్రేండ్ ని మార్చిన యంగ్ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్, 21F లాంటి సూప‌ర్‌హిట్ చిత్రం త‌రువాత యూత్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న హెబాప‌టేల్‌, త‌మిళం లో అట్ట‌క‌త్తి, ముందాసిప‌త్తి, ఎధిర్ నీచ‌ల్ లాంటి చిత్రాల‌తో స‌క్స‌స్‌ఫుల్ హీరోయిన్ గా పేరుగాంచిన నందిత స్వేత  ల కాంబినేష‌న్ లో టైగ‌ర్ లాంటి ఎమెష‌న‌ల్ సూప‌ర్‌హిట్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడిగా మేఘ‌న ఆర్ట్స్ నిర్మాణంలో మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఢిఫ‌రెంట్ లవ్ స్టోరి ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే 80% షూటింగ్ ని పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. ఇప్ప‌టికే ప్రీ టీజ‌ర్ పోస్ట‌ర్ కి హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. జూన్ 1న హీరో నిఖిల్ పుట్టిన‌రోజు సంధ‌ర్బ‌మ్ గా చిత్రం మెద‌టి లుక్ ని విడుద‌ల చేస్తున్నారు. 
ఈ సంద‌ర్భం గా నిర్మాత‌లు మాట్లాడుతూ.. మా మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో నిఖిల్ హీరోగా , హెబాప‌టేల్, నందిత శ్వేత ల కాంబినేష‌న్ లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్న చిత్రానికి ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము. 80% షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌య్యింది. మా ద‌ర్శ‌కుడు ఆనంద్ చాలా కొత్త గా ఆలోచిస్తారు. ఆయ‌న తీసిన టైగ‌ర్ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అక‌ట్టుకుంది. మా ఈ చిత్రం కూడా అంద‌రి ఆద‌ర‌ణ పోందుతుంది. మా హీరో నిఖిల్ చాలా సెల‌క్టివ్ గా కొత్త చిత్రాలు అందిస్తున్నారు, అలానే మా ద‌ర్శ‌కుడు ఆనంద్ కూడా అంతే కొత్త‌గా చేస్తున్నారు. ట్రెండ్ లో వుంటూనే ఎంట‌ర్‌టైనింగ్ చేయ‌టంలో వీరిద్ద‌రూ సిద్ధ‌హ‌స్తులే అలాంటిది వీరిద్ధ‌రి కాంబినేష‌న్ అన‌గానే ఎలాంటి చిత్రం రానుందో అనుకునే ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకునేలా వుంటుంది. అంతేకాదు మేము రీసెంట్ గా విడుద‌ల చేసిన ప్రీ టీజ‌ర్ పోస్ట‌ర్ కి అటు వెబ్ మీడియాలో, ఇటు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా ట్రెండింగ్ అవ్వ‌టం అంద‌రూ ఫ‌స్ట్ లుక్ కోసం ఫోన్ కాల్స్ చేయ‌టం మా చిత్రం యెక్క క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. హీరో నిఖిల్ పుట్టిన‌రోజు సంధ‌ర్బ‌మ్ గా జూన్ 1న మెద‌టి లుక్ ని విడుద‌ల చేస్తున్నాము. చాలా వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థ తో తెర‌కెక్కిస్తున్నాము. అతి త్వ‌ర‌లో టీజ‌ర్ ని , త్వ‌ర‌లో శేఖ‌ర్ చంద్ర అందించిన‌ ఆడియో ని విడ‌ద‌ల చేసి చిత్రాన్ని అగ‌ష్టు లో విడుద‌ల చేయాటానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. అని అన్నారు
నిఖిల్‌, హెబాప‌టేల్‌, నందిత శ్వేత‌(ప‌రిచ‌యం), వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, తాగుబోతు ర‌మేష్‌, జోష్ రవి, వైవా హ‌ర్ష‌, సుద‌ర్శ‌న్, భ‌ద్ర‌మ్‌, అపూర్వ శ్రీనివాస్ మెద‌ల‌గు వారు న‌టించ‌గా..
పాట‌లు- రామ‌జోగ‌య్య శాస్ట్రి, శ్రీమ‌ణి,ఆర్ట్‌- రామాంజ‌నేయులు, ఎడిట‌ర్- చోటా.కె.ప్ర‌సాద్‌, సంగీతం-శేఖ‌ర్ చంద్ర‌, మాట‌లు- అబ్బూరి ర‌వి, డి.ఓ.పి- సాయి శ్రీరామ్‌, నిర్మాత‌- మేఘ‌న ఆర్ట్స్‌, స్టోరి, స్క్రీన్‌ప్లే,డైర‌క్ట‌ర్‌- వి.ఐ.ఆనంద్‌,