బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్ చేయబోతున్న నిఖిల్


స్వామిరారా, కార్తికేయ‌, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా వంటి వ‌రుస విజ‌యాల‌తో ఊపు మీద ఉన్న యంగ్ హీరో నిఖిల్ ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో `కేశ‌వ` చిత్రంతో సంద‌డి చేయ‌బోతున్నాడు. ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న 'కేశవ' సినిమా మే 12 న విడుదల కానుంది. ఈ సినిమా త‌ర్వాత నిఖిల్ ఓ క‌న్న‌డ చిత్రం రీమేక్‌లో న‌టించ‌బోతున్నాడు. కన్నడంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన `కిర్రిక్ పార్టీ` అనే చిత్రాన్ని తెలుగులో ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో రూపొందించ‌నున్నారు.


ఈ సినిమాను ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ రాజు సుంద‌రం ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నాడనేది క‌న్‌ఫర్మ్ అయ్యింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మం ఏంటంటే ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు చంద మొండేటి డైలాగ్స్‌, స్క్రీన్‌ప్లే బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తాడ‌ట. జూన్ నుండి సినిమా సెట్స్‌లోకి వెళ్ళ‌నుంది.