Latest News

ఈనెల 30 న సంపూర్ణేష్ బాబు ' వైరస్' విడుదల. 'మామ్‌' సెన్సార్‌ పూర్తి - జూలై 7 విడుదల జూలై 7న డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 'రాక్షసి' అట్యిట్యూడ్ వ‌ల్లే గ‌బ్బ‌ర్‌సింగ్ వ‌చ్చింది. గబ్బ‌ర్‌సింగ్ వ‌ల్ల నాకు అట్యిట్యూడ్ రాలేదు : హ‌రీష్ శంక‌ర్ వంద‌కోట్లు అనేది నంబ‌ర్ కాదు. అంత మంది ప్రేక్ష‌కుల ప్రేమ : అల్లు అర్జున్ మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా డీజే.. 100 కోట్లు సాధించ‌డం ఆనందంగా ఉంది - దిల్‌రాజు విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన 'ఏజంట్‌ భైరవ' జూలై 7న విడుదల ఈరోజు నిన్నుకోరి సినిమా జ్యూక్ బాక్స్ విడుదల. జై లవ కుశ టీజర్ మరియు సినిమా విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్. గ్లామర్ తో తెలుగు సినీ పరిశ్రమకి గాలం వేసిన పూజ హెగ్డే

యంగ్‌ హీరో నిఖిల్‌ చేతుల మీదుగా ‘తొలి పరిచయం’ ట్రైలర్‌ లాంచ్‌


పియుకె ప్రొడక్షన్స్‌ పతాకంపై దీపక్‌కృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘తొలి పరిచయం’. ఎల్‌. రాధాకృష్ణ దర్శకుడు. వెంకీ, లాస్య హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. మురళీమోహన్‌, సుమన్‌, రాజీవ్‌ కనకాల, రఘుబాబు, ఛత్రపతి శేఖర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్‌ హీరో నిఖిల్‌ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పోస్టర్స్‌, ట్రైలర్స్‌ క్యూరియాసిటీ కలిగించే విధంగా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా యంగ్‌ ప్రొడ్యూసర్, డైరెక్టర్‌ పరిచయం అవుతున్నారు. ఇటీవల కాలం లో   సినిమాలో కొంచెం బాగున్నా  ఆడేస్తున్నాయి. మంచి వసూళ్లు రాబడుతున్నాయి. నా ఫ్రెండ్‌ కళహరి రెడ్డి ఈ సినిమాలో ఓ పార్ట్‌ అయ్యాడు. తనతో పాటు టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’ అన్నారు.

ఛత్రపతి శేఖర్‌ మాట్లాడుతూ... ‘ఈ సినిమాలో తాగుబోతు పాత్రలో నటించాను. నా మీద ఒక పాట కూడా ఉంటుంది. నిర్మాతలు రాజీపడకుండా బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించారు. డైరెక్టర్‌కి తొలి సినిమా అయినా  అందరికీ నచ్చేవిధంగా తెరకెక్కిస్తున్నారు’ అన్నారు.

హీరో వెంకీ మాట్లాడుతూ.. ‘ప్రజంట్‌ జనరేషన్‌ ఆలోచనకు అద్దం పట్టేలా ఈ చిత్రం ఉంటుంది. పాపికొండల్లాంటి అందమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ జరిగింది’ అన్నారు.

హీరోయిన్‌ లాస్య మాట్లాడుతూ.. ‘హీరోయిన్‌గా అవకాశం కల్పించిన దర్శక నిర్మాతకు ధన్యవాదాులు`  అన్నారు.

సంగీత దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ... ‘రొటీన్‌కు భిన్నంగా ఉండే చిత్రమిది. సంగీతానికి ప్రాధాన్యత ఉన్న చిత్రం కావడంతో మంచి పాటలొచ్చాయి. త్వరలో ఆడియో రిలీజ్‌ వేడుక ఉంటుంది’ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దీపక్‌కృష్ణ, కళహరి రెడ్డి తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

మురళీమోహన్‌, సుమన్‌, రాజీవ్‌ కనకాల,  రఘుబాబు, ఛత్రపతి శేఖర్‌, వైవా హర్ష, కళ్లు కృష్ణారావు, ప్రీతినిగమ్‌, రాగిణి, మధుమణి, సాహితి, దీప్తి, మాధవి, రామిరెడ్డి తదితరులు  నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫి: శరవణ కుమార్‌ సి., ఎడిటర్‌: కృష్ణపుత్ర, మ్యూజిక్‌: ఇంద్రగంటి, డాన్స్‌: కృష్ణారెడ్డి, లిరిక్స్‌: చంద్రబోస్‌, కాసర్ల శ్యాం, కరుణాకర్‌, కో ప్రొడ్యూసర్‌: సురేష్‌కుమార్‌, ధర్మేంద్ర, నిర్మాత: దీపక్‌కృష్ణ, దర్శకత్వం: ఎల్‌.రాధాకృష్ణ.