Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

Niharika: Next Savitri in TFI


సినిమా ఇండస్ట్రీలో ఫేవ‌రెట్ అనే పదానికి ఎంత ప్రాధాన్య‌త ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. హీరోల్ని బాబు అంటూ నెత్తిన పెట్టుకొని చూసుకోవటం మామూలే. లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకునే హీరోల్ని ఆ మాత్రం గౌరవించటం తప్పేం కాదని వాదించేవాళ్లు ఉంటారు. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పటివరకూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న తీరుకు బిన్నంగా.ఒక పెద్ద బ్యాక్ గ్రౌండ్ క‌లిగిన ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయి హీరోయిన్ గా నటించటం మామూలు విష‌యం కాదు. ఒక మ‌న‌సు ఆడియో ఫంక్షన్ సందర్భంగా నిహారికను ఎత్తేసిన వైనం చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావటం ఖాయం. ఎక్కడైనా ఒక సినిమా విడుదలైన తర్వాత.. బాగా చేస్తే.. అరే.. చాలా బాగా చేశారంటూ కాంప్లిమెంట్స్ ఇస్తే ఓకే.. కానీ.. అందుకు భిన్నంగా నిహారిక నటించిన తొలి చిత్రం విడుదల కాక ముందే.. ఆమెను సావిత్రి.. సౌందర్య.. అనుష్కలతో పోల్చ‌టం చూస్తే వింత‌గా అనిపిస్తుంది. ‘‘ఒక మనసు’’ చిత్రంలో నిహారిక బాగా నటించి ఉండొచ్చు. అయితే.. ఆ సినిమా విడుదలై.. ప్రేక్షకుల ప్రశంసలు పొందిన తర్వాత ఆమెను పొగిడేయటంలో ఒక అర్థం ఉంటుంది. కానీ మహామహులతో పొగిడేటప్పుడు కొంచెం ప్రేక్ష‌కుల ఆమోదం కూడా ఉండాలిగా ఎంత మెగా ఫ్యామిలీ నుండి వ‌స్తే మాత్రం..