పవన్ త్రివిక్రమ్ సినిమాలో చేరిన మరో స్టార్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ 25వ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం మొదట దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్ తో ప్రచారం కాగా, ఇప్పుడు ఈ చిత్ర టైటిల్ ఇంజనీర్ బాబు అని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇందులో సీనియర్ నటి ఖుష్ బూ కీలక పాత్ర పోషిస్తుండగా, బాలీవుడ్ నటుడు సోను సూద్ ని ముఖ్య పాత్రకు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. 

త్రివిక్రమ్ తెరకెక్కించిన అతడు, జులాయి చిత్రాలలో నటించిన సోనుసూద్ ఇప్పుడు పవన్ మూవీలోను పవర్ ఫుల్ పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది. బిజినెస్ మెన్ గా నెగిటెవ్ షేడ్ లో సోనూసూద్ ని చూపించబోతున్నాడు త్రివిక్రమ్. సోను సూద్ గత చిత్రాలు భాయ్, ఆగడు మరియు అభినేత్రి చిత్రాలు తెలుగులో డిజాస్టర్ అయ్యాయి. అందుకే ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వాలని భావిస్తున్నాడు. అయితే ఈ విషయం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. హారిక హాసిని బేనర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే వీరు టీంతో కలిసి పనిచేస్తున్నారు.