షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘నేత్ర’


రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై గోపీచరణ్‌, ఐశ్వర్య అడ్డాల‌ హీరో హీరోయిన్‌లుగా రెడ్డెం యాదకుమార్‌ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం ‘నేత్ర’. మై స్వీట్‌ హార్ట్‌ అనేది ట్యాగ్‌లైన్‌. విశాఖపట్నం, అరకు, రాజమండ్రి ప్రాంతాల్లో జరిపిన షూటింగ్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ... ‘చిన్నప్పటి నుంచి సినిమాల‌పై ఉన్న ఆసక్తితో స్నేహితుల‌ సహకారంతో ‘నేత్ర’ చిత్రాన్ని రూపొందించాను.  విశాఖ, అరకు, రాజమండ్రి ప్రదేశాల్లో జరిపిన  షూటింగ్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  దర్శకుడు చిత్రాన్ని చక్కగా మలిచాడు. చిత్ర యూనిట్‌ సభ్యుల‌ సహకారంతో సినిమా చాలా బాగా వచ్చింది. అక్టోబర్‌లో ఆడియోను విడుదల‌ చేసి, నవంబర్ నెల‌లో ఈ చిత్రాన్ని విడుదల‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
చిత్ర దర్శకుడు రెడ్డెం యాదకుమార్‌ మాట్లాడుతూ... ‘ల‌వ్‌ అండ్‌ హర్రర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ఫస్టాఫ్‌ సిటీ నేపథ్యంలో నడుస్తుంది. సెకండాఫ్‌ గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది. ఆడియన్స్‌కి కావాల్సిన కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. గతంలో ‘లైఫ్‌’ అనే చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తూ హీరోగా నటించాను. ఈ సినిమాలో కూడా గెస్ట్‌ రోల్‌ చేశాను. హీరో  గోపిచ‌ర‌ణ్‌, హీరోయిన్‌ ఐశ్వర్య బాగా నటించారు. కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్లస్‌ అవుతుంది. మా నిర్మాతకు ఇదే తొలి సినిమా అయినా ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. అనుకున్న దానికంటే కూడా సినిమా చాలా బాగా వచ్చింది. సత్యానంద్‌గారు, వారి అబ్బాయి ఈ చిత్రంలో నటించారు. వీరిరువురూ కలిసి నటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి అన్నారు.
గోపిచరణ్‌, ఐశ్వర్య హీరో హీరోయిన్‌లుగా నటిస్తుండగా, స్టార్‌మేకర్‌ సత్యానంద్‌, ఐకె త్రినాధ్‌, ధీరేంద్ర ధీరు, బుగత సత్యనారాయణ, హేమ, రేణుక, రాఘవేంద్ర, ప్రియాంక, సునీల్‌ చరణ్‌, తిరుమల‌రెడ్డి, జబర్దస్త్‌ అప్పారావు, జనార్ధన్‌ తదిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్‌నాగ్‌ రతన్‌దాస్‌, మాట‌లు: ప్రసాదుల‌ మధుబాబు, కెమెరా:  ఎస్‌.వి. గోపాల్‌, ఎడిటింగ్‌: నర్సింగ్‌ రాధోడ్‌, కొరియోగ్రఫి: లుక్స్‌ రాజశేఖర్‌, బాల‌కృష్ణ, ఫైట్స్‌: బాజీరావు,  నిర్మాత: పీరికట్ల రాము, కథ ` స్క్రీన్‌ప్లే ` దర్శకత్వం: రెడ్డెం యాదకుమార్‌.