Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేసుకున్న ‘నేత్ర’


రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై గోపీచరణ్‌, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్లుగా రెడ్డెం యాదకుమార్‌ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం ‘నేత్ర’. మై స్వీట్‌ హార్ట్‌ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇటీవలే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తి చేసుకుంది. నవంబర్‌ రెండో వారంలో ఆడియో విడుదల‌ చేసి అదే నెల చివరి వారంలో సినిమాను విడుదల‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ... ‘‘ విశాఖ, అరకు, రాజమండ్రి ప్రాంతాల్లో షూటింగ్‌ జరిపాము. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. దర్శకుడు చిత్రాన్ని చెప్పిదానికంటే కూడా అద్భుతంగా తెరకెక్కించారు. అవుట్‌ పుట్‌ పట్ల యూనిట్‌ సభ్యుల‌మంతా చాలా హ్యాపీగా ఉన్నాం. నవంబర్‌ రెండో వారంలో ఆడియో విడుదల‌ చేసి, అదే నె చివరి వారంలో సినిమాను విడుదల‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. చిత్ర దర్శకుడు రెడ్డెం యాదకుమార్‌ మాట్లాడుతూ... ‘గతంలో నేను ‘లైఫ్‌’ అనే చిత్రాన్ని డైరక్ట్‌ చేస్తూ నటించాను. ‘నేత్ర’ నా రెండో సినిమా. ఈ సినిమాలో కూడా గెస్ట్‌ రోల్‌ చేశాను. దీన్ని ల‌వ్‌ అండ్‌ హర్రర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాము. సిటీ నేపథ్యంతో పాటు గ్రామీణ నేపథ్యంలో కూడా కథ నడుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల‌కు నచ్చే విధంగా సినిమా ఉంటుంది. ఫైనల్‌ అవుట్‌ పుట్‌ చూసిన మా నిర్మాత చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. ఒక మంచి సినిమా చేశామంటూ టీమ్‌ అంతా ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం. నటీనటుందరూ కూడా వారి వారి పాత్రల‌కు న్యాయం చేశారు. సత్యానంద్‌గారు, వారి అబ్బాయి పాత్ర‌లు సినిమాకు చాలా కీల‌కంగా ఉంటాయి. వీరిరువురూ కలిసి నటించడం ఇదే ప్ర‌థ‌మం’’ అన్నారు. గోపిచరణ్‌, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, స్టార్‌మేకర్‌ సత్యానంద్‌, ఐకె త్రినాధ్‌, ధీరేంద్ర ధీరు, బుగత సత్యనారాయణ, హేమ, రేణుక, రాఘవేంద్ర, ప్రియాంక, సునీల్‌ చరణ్‌, తిరుమరెడ్డి, జబర్దస్త్‌ అప్పారావు, జనార్ధన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్‌నాగ్‌ రతన్‌దాస్‌, మాట‌లు ప్రసాదుల‌ మధుబాబు, కెమెరా: ఎస్‌.వి. గోపాల్‌, ఎడిటింగ్‌: నర్సింగ్‌ రాధోడ్‌, కొరియోగ్రఫి: లుక్స్‌ రాజశేఖర్‌, బాల‌కృష్ణ, ఫైట్స్‌: బాజీరావు, నిర్మాత: పీరికట్ల రాము, కథ ` స్క్రీన్‌ప్లే ` దర్శకత్వం: రెడ్డెం యాదకుమార్‌.