Latest News

'రారండోయ్‌ వేడుక చూద్దాం' నా కెరీర్‌లో మెమొరబుల్‌ మూవీ అవుతుంది కాపీ కొట్టారని 'రాబ్తా' సినిమాపై కేసు వేసిన మగధీర నిర్మాతలు ఈ సినిమాతో నా మార్కెట్ పెగరబోతోంది : నాగ చైతన్య నాగ చైతన్యకి నేను వేరే ఛాన్స్ ఇవ్వలేదు : సమంత 'జయదేవ్‌' చిత్రంలోని నాలుగో పాటని రిలీజ్‌ చేసిన దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ నాకు విపరీతమైన మొహమాటం, సిగ్గు పది మంది ముందు మాట్లాడటానికి కూడా చాలా భయం : ప్రభాస్ సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధమైన 'అమీ తుమీ' సినిమా రజినీ కాంత్ కొత్త సినిమా టైటిల్ 'కాలా' విడుదలైన హెబ్బా పటేల్ 'ఏంజెల్' ఆడియో గతంలో ఓ మ్యూజిక్ డైరెక్టర్‌ను బాగా ఇష్టపడ్డాను : శృతిహాసన్

Ravi Teja One More Time With Thaman


ర‌వితేజ కెరీర్ కు ట‌ర్నింగ్ అంటే కిక్ అనే చెప్పుకోవాలి. బాగా డల్ గా ఉన్న రవితేజ‌ కెరీర్ కి కిక్ సినిమా నిజంగానే మాంచి కిక్ ఇచ్చింది. దాంతో అప్పటి నుంచి మాస్ రాజాకు సెంటిమెంట్ గా మారిపోయాడు కిక్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తమన్ పై ఎన్ని విమర్శలు వచ్చినా, ర‌వితేజ మాత్రం వదలకుండా తన సినిమాలకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. దానికి తగ్గట్టే, తమన్ కూడా మాస్ రాజా సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇస్తూ తన వాల్యూ చాటుకుంటున్నాడు. కిక్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వరుస‌గా ఆంజనేయులు, మిరపకాయ్, వీర, నిప్పు, బలుపు, పవర్, కిక్ 2 సినిమాలు రాగా.. తాజాగా కొత్త డైరెక్టర్ చక్రి తోలేటి డైరెక్షన్లో రాబోతున్న రాబిన్ హుడ్ సినిమా కు కూడా రవితేజ తమన్ నే  ఎంచుకున్నాడట.  ఏమైనా ఈ కాలంలో ఒక హీరో, మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్లో వరసగాదాదాపు 9 సినిమాలు రావడమంటే మామూలు విష‌యం కాదు.