Latest News

`జూన్ 1: 43` పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి, జూన్‌లోనే రిలీజ్‌! డీజే అన్ని రికార్డులు బద్దలు కొడుతుంది : పూజ హెగ్డే తాప్సి హీరోయిన్ గా నటిస్తున్న 'ఆనందో బ్రహ్మ' ఇన్నోవేటివ్ మోషన్ పోస్టర్ అన్ని ఏరియాల స్పంద‌న అద్భుతం- `ఓ పిల్లా నీ వ‌ల్లా` ద‌ర్శ‌క‌నిర్మాత కిషోర్‌ సునీల్ 'ఉంగరాల రాంబాబు' జూన్ లో విడుదల `అంధ‌గాడు` సెన్సార్ పూర్తి.. జూన్ 2న విడుద‌ల గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్' జూన్ 9 న విడుదల 25 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ రాజ‌శేఖ‌ర్‌ 'గరుడ వేగ 126.18 ఎమ్' జూన్ 2న వ‌స్తున్న `వెక్కిరింత‌`విడుదల ఒకేసారి రెండు మల్టీ స్టారర్ సినిమాలు కలిసి చేస్తున్న సుధీర్ బాబు & నారా రోహిత్

Sweety Hyderabad's Most Desirable Women


హైద్రాబాద్ లో మోస్ట్ డిజైరబుల్ విమన్ ఎవరు..? కాటుక క‌ళ్ల‌తో కుర్ర‌కారు మ‌తిపోగిట్టించిన ఈ అమ్మ‌డు 30ల్లోనూ టాప్ పొజిష‌న్ లో ఉండ‌టమంటే మామూలు విష‌యం కాదు. హైద‌రాబాద్ వాసులు ఇప్పటికీ అనుష్కనే నెంబర్ వన్ అని తేల్చి చెప్పేశారు. ఇటీవ‌ల టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వ‌హించిన  మోస్ట్ డిజైరబుల్ విమెన్ లిస్ట్ లో.. హైదరాబాద్ లో ఇప్పటికీ అనుష్క టాప్ ప్లేస్ లో ఉండ‌టం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కొత్త హీరోయిన్ ల‌ను ప‌క్క‌కు నెట్టి అనుష్క త‌న స్టామినా ఏంటో నిరూపించుకుంది. టాలీవుడ్ లో ఏదైనా ప‌ర్టిక్యుల‌ర్ రోల్స్ చేయాల్సిఇ వ‌స్తే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మొద‌ట గుర్తొచ్చే పేరు అనుష్క‌. నటన మీదా,గ్లామర్ ప్రదర్శన మీదా ఈ అమ్మడికి ఉన్న కమాండ్, 30 ఏళ్ళ స్వీటీని టాప్ ప్లేస్ లో నిలబెడుతోంది. నిజానికి బాహుబలికి ముందు అనుష్క కి ఉన్న‌ క్రేజ్ బాగా తగ్గిందనే అనుకున్నారు. అరుంధతి తర్వాత అనుష్కకి సరైన హిట్ లేక కొంచెం వెన‌క‌బ‌డిన ఈ అమ్మ‌డు .. బాహుబ‌లిలో దేవసేన పాత్రతో అనుష్క రేంజ్ మళ్లీ ఒక్కసారిగా టాప్ పొజిషన్ కి వెళ్ళింది. స్క్రీన్ పై క‌నిపించింది కాసేపే అయినా తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని తన నటనతో ఆకట్టుకుంది. అయితే 30ల్లోనూ మోస్ట్ డిజైరబుల్ అనిపించుకోవడం అంత సులువైన విషయమేమీ కాదు. కానీ అనుష్క మాత్రం ఈ విషయాన్ని అంతగా పట్టించుకోపోగా, ఇలాంటి నెంబర్ గేమ్ ని అసలు పట్టించుకోనని అంటోంది. నా ఏజ్ కంటే ఇండస్ట్రీకి నా ఫేస్ చాలా ముఖ్యం. దాన్ని కాపాడుకోవడానికే నేను బాగా ఇష్టపడతాను. ఆరోగ్యంగా సంతోషంగా ఉండడమే నా సీక్రెట్ అంటోంది అనుష్క. ఇదే స‌ర్వేని మేల్ యాక్ట‌ర్స్ విష‌యంలోనూ నిర్వహించ‌గా మోస్ట్ డిజైర‌బుల్ మెన్ గా ఆ స్థానం ప్రిన్స్ మ‌హేష్ ను వ‌రించింది.