బాల‌య్య స‌ర‌స‌న హీరోయిన్‌ను క‌న్ఫార్మ్ చేసిన పూరీ


గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి విజ‌యం త‌ర్వాత బాల‌య్య పూరీ జ‌గ‌న్నాధ్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాలో హీరోయిన్ కోసం గత కొన్నాళ్లుగా వెతుకుతున్నారు. అయితే ఈ సినిమా ద్వారా ఒక కొత్త హీరోయిన్ ను ప‌రిచ‌యం చేయ‌నున్నాడ‌ట పూరీ. ఆ అమ్మాయి పేరు ముస్కాన్. ఈ అమ్మాయే బాల‌య్య స‌ర‌స‌న న‌టించే లీడ్ హీరోయిన్. ముస్కాన్ తో పాటూ బాల‌య్య స‌ర‌స‌న ఇంకో అమ్మాయికి కూడా ఛాన్స్ ఉంది. అయితే ఆ హీరోయిన్ ను కూడా కొత్త‌మ్మాయిని దింపుతారా లేక ఆల్రెడీ ఉన్న వాళ్ల‌నే తీసుకుంటారా అన్న‌ది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. వీళ్లిద్ద‌రితో పాటూ ఈ సినిమాలో స‌న్నీ లియోన్ కూడా ఓ ఐటెమ్ సాంగ్ చేస్తుంద‌ని వచ్చిన వార్త‌లు కూడా నిజ‌మే అని తేల్చిశాడు పూరీ. 

ఈ తరుణంలోనే బాల‌య్యతో క‌లిసి ప‌నిచేయ‌డం గురించి చెప్తూ, ఈ సినిమాలో బాల‌య్య ను కొత్త గ్యాంగ్ స్ట‌ర్ గా, ఇంత‌కుముందెప్పుడూ చూడ‌ని లుక్ తో ప్రెజెంట్ చేయ‌బోతున్నా.ఆల్రెడీ మొద‌టి షెడ్యూల్ ను పూర్తి చేశాం. హైద‌రబాద్ తో పాటూ, కొంత భాగం విదేశాల్లోనూ షూట్ చేయ‌బోతున్నాం. ఇంట‌ర్వెల్ ముందు వచ్చే యాక్ష‌న్ సీక్వెన్స్ పూర్తి చేసేశాం. ఇందులో డైలాగ్స్, ఫైట్స్ అన్నీ కొత్త‌గా ఉంటాయి. బాల‌కృష్ణ‌ గారితో ప‌నిచేయ‌డం ఎలా ఉంటుందో అనుకున్నా. కానీ నేను అనుకున్న దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఆయ‌న ఎన‌ర్జీని చూస్తే ఎవ్వ‌రికైనా ఎన‌ర్జీ వ‌చ్చేస్తుంది.అనుకున్న టైమ్ కంటే ముందే వ‌చ్చి సెట్ లో కూర్చుంటారు. ఇంత క్ర‌మ‌శిక్ష‌ణ ఆయ‌న‌కు ఎన్టీఆర్ గారి దగ్గ‌ర నుంచే వ‌చ్చింద‌నుకుంటా.. అన్నారు పూరీ.