Latest News

'రాజరథం' పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్ * 'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన

క్ష‌ణం.. పెళ్లి చూపులు.. న‌రుడా డోన‌రుడా..


తొలిసారి స్వీయ నిర్మాణంలో ‘నరుడా డోనరుడా’ సినిమా చేశాడు సుమంత్. ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకున్నాడు నాగ్ మేనల్లుడు. ఐతే ఈ సినిమాను తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీతో తీర్చిదిద్దడానికి తమకు స్ఫూర్తి ‘క్షణం’ సినిమానే అంటున్నాడు సుమంత్. ‘క్షణం’ సినిమాను పరిమితమైన బడ్జెట్లో అద్భుతమైన క్వాలిటీతో తెరకెక్కించారని.. తాము కూడా ‘నరుడా డోనరుడా’ విషయంలో అలాగే ప్రయత్నించామని సుమంత్ తెలిపాడు. ఈ సినిమా విష‌యంలో పక్కా ప్రణాళికతో ఉన్నట్లున్నాడు సుమంత్. ఈ సినిమాకు అనుకోకుండా పాజిటివ్ బజ్ రావడంతో.. ప్రమోషన్ జోరు పెంచి మంచి హైప్ మధ్య సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ట్రైలర్ లాంచ్ చేయించ‌డం, ఆడియో లాంఛ్ కు మావ‌య్య నాగార్జున తో పాటూ, అఖిల్ ను తీసుకురావ‌డం, మొన్న విక్ట‌రీ వెంక‌టేష్ తో వెంకీ మార్క్ విషెస్ చెప్పించ‌డంతో సినిమా మీద మంచి బ‌జ్ ఏర్ప‌డింది. అంతేకాదు మ‌రికొందరు సినీ ప్ర‌ముఖుల్ని కూడా రంగంలోకి దించే యోచ‌న‌లో ఉన్నాడ‌ట ఈ డోన‌రుడు. స‌రైన ప్ర‌మోష‌న్స్, ప‌బ్లిసిటీ ఉండాలే కానీ, అస‌లు క‌థ లేని సినిమాల‌కు కూడా క‌లెక్ష‌న్స్ కురిపించేస్తారు మ‌న ప‌బ్లిసిటీ ఏజెంట్స్. అదే ఇక సినిమా బాగుంటే ఇక చెప్పే ప‌న్లేదు. క్ష‌ణం దగ్గ‌ర నుంచి, రీసెంట్ గా వ‌చ్చిన పెళ్లి చూపులు వ‌ర‌కు ఇదే జ‌రిగింది. ఇప్పుడు సుమంత్ కూడా అదే ట్రెండ్ ని ఫాలో అయిపోయాడు. కేవ‌లం కోటి రూపాయ‌ల్లోనే సినిమా మొత్తాన్ని పూర్తి చేసేశాడు. నిర్మాత‌లు వాళ్లే కాబ‌ట్టి, సుమంత్ కి రెమ్యూన‌రేష‌న్ ఉండ‌దు. దీంతో పాటూ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ఉండే మౌలిక స‌దుపాయాలు కూడా ఉచితం. సినిమా నిర్మాణంలో ముఖ్యంగా ఖ‌ర్చు అంటే ఇవే. ఈ రెండు ఉచితం కావ‌డంతో, మిగిలిన బడ్జెట్ ను జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుని, కోటి రూపాయ‌ల్లోనే పూర్తి చేసేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌బ్లిసిటీ విష‌యంలో క్ష‌ణం, పెళ్లి చూపులు చిత్రాల‌కు ఏ మాత్రం తీసిపోని ఈ చిత్రం, క‌లెక్ష‌న్స్ విష‌యంలోనూ అంత‌టి విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుందాం.