Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Nani To Romance With Sailaja


నానితో శైల‌జ‌..
ఐ ల‌వ్ యూ.. బ‌ట్ ఐయామ్ నాట్ ల‌వ్ విత్ యు అంటూ నేను శైల‌జ లో రామ్ జోడీగా అల‌రించిన కీర్తి సురేష్ ను కుర్ర‌కారు ఇంకా మ‌రిచిపోలేదు. నేను శైల‌జ త‌ర్వాత తెలుగులో కీర్తి స్టార్ హీరోయిన్ అయిపోయి త‌న హ‌వా కొన‌సాగిస్తుంద‌నుకున్న నేప‌థ్యంలో తెలుగు సినిమాలు ఓకే చేయ‌లేనంతగా ఆమె కోలీవుడ్ లో విజ‌య్, ధ‌నుష్ వంటి అగ్ర‌క‌థానాయ‌కుల స‌ర‌స‌న చోటు ద‌క్కించుకుంటూ దూసుకెళ్తుంది. ఈ త‌రుణంలోనే తాజాగా ఈ శైల‌జ ఒక తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. సినిమా చూపిస్తా మావ డైర‌క్ట‌ర్ త్రినాథ‌రావు, నాని కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమాలో కీర్తిని ఎంపిక చేసిన‌ట్లు చెప్తున్నారు. బెక్కం వేణుగోపాల్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త‌ర్వాత అయినా కీర్తి తెలుగు సినిమాలు చేస్తుందేమో చూడాలి మ‌రి.