వైజాగ్ లో నాని 'నిన్ను కోరి' సినిమా షూటింగ్


నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్మాణ దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.3గా నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి' శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.


మొదటి షెడ్యూల్ అమెరికాలో నెలరోజుల పాటు షూటింగ్‌ జరుపుకున్న చిత్ర బృందం,  ఈరోజు నుండి నెలాఖరు వరకు వైజాగ్‌లో  షూటింగ్‌ జరగనుంది. నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీ నాయర్‌, నీతు, భూపాల్‌ రాజ్‌, కేదార్‌ శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.