Latest News

'రాజరథం' పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్ * 'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన

నాచురల్ స్టార్ 'నాని', 'హనురాఘవపూడి' ల కాంబినేషన్ లో మరో చిత్రం


వరుసగా 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' ', 'జెంటిల్ మాన్', 'మజ్ను' 'నేను లోకల్ ' వంటి ఘన  విజయం సాధించిన చిత్రాల కధానాయకుడు నాచురల్ స్టార్ నాని హీరోగా నూతన యువ నిర్మాతలు శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరువూరి సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. 'నాని' హీరోగా 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు 'హనురాఘవపూడి'  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.హీరో నాని. తన కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందనుండటం సంతోషంగా ఉందని దర్శకుడు తెలిపారు. 

ఈ చిత్రానికి సుప్రసిద్ధ సంగీత దర్శకుడు 'మణిశర్మ' సంగీతం అందిస్తుండగా, ఛాయాగ్రహణం 'యువరాజ్' (కృష్ణ గాడి వీరప్రేమగాధ, ప్రస్తుతం హీరో నితిన్ హనురాఘవపూడి ల చిత్రం). చిత్రం లోని ఇతర నటీ,నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే మీడియా కు తెలియ పరచటం జరుగుతుంది. 2017 ఆగస్టు నెలలో చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చిత్ర నిర్మాతలు శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరువూరి తెలిపారు.